రాష్ట్ర అభివృద్ధికై జనసేనకు ఒక్క చాన్స్ ఇవ్వండి.. కార్యక్రమానికి శ్రీ కారం చుట్టిన మాకినీడి!!

పిఠాపురం: కాకినాడ జిల్లా, జనసేన పార్టీ బలోపేతానికి కృషి చేస్తూ.. పార్టీని అధికారం వైపు అడుగులు వేయించడానికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వెంటే ఉండి అదిష్టానం ఆదేశాల మేరకు ప్రజల పక్షాన అండగా నిలిచి, ప్రతీ సమస్యపై స్పందించి నియోజవర్గంలో పార్టీ తరుపున చురుకైన పాత్ర పోషిస్తున్న పిఠాపురం నియోజకవర్గ జనసేన ఇంచార్జి మాకినీడి శేషుకుమారి మరో కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. రాష్ట్ర అభివృద్ధికై జనసేనకు ఒక్క చాన్స్ అంటూ స్థానిక 25వ వార్డు లో కోట సత్తమ్మ అలయం వద్ద జనసైనికులు, వీరమహిళలు, జనసేన కార్యకర్తల మధ్య కోట సత్తమ్మ అమ్మ వారికి పూజలు నిర్వహించి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. అనంతరం మీడియాతో తదుపరికార్యాచరణ గురించి మాట్లాడుతూ.. కోట సత్తమ్మ గారి ఆశీస్సులతో ఇంటింటా జనసేన పార్టీ కి ఒక్క చాన్స్ కార్యక్రమంలో బాగంగా నియోజకవర్గంలో ప్రతీ గడపకు వెళ్ళి పార్టీ సిద్ధంతాలు ఆశయాలు హామీలతో కూడుకున్న మ్యానిఫెస్టోల్ కర పత్రాని పంచీ పార్టీ దశదిశలను ప్రజలకు వివరిస్తూ పార్టీని మరింత ముందుకు తీసుకెళ్తానని, పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రి చేయడమే తమ ద్యేయమని, పవన్ కళ్యాణ్ గారు అప్పగించిన బాధ్యతను సక్రమంగా నిర్వర్తిస్తానని జనసైనికులు, నాయకులు, వీరమహిళలు ఈ కార్యక్రమం విజయవంతం చేయాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో గొల్లప్రోలు మండల ప్రెసిడెంట్ అమరాది వల్లి రామకృష్ణ, బుర్రా సూర్యప్రకాష్, మేళం రామకృష్ణ, కారపురెడ్డి మణికంఠ, గోపు సురేష్, పబ్నీనీడి దుర్గాప్రసాద్, రసంశెట్టి కన్యాకర్ రావు, యండ్రపు శ్రీనివాస్, కంద సోమరాజు, దేశి రెడ్డి సతీష్, సింగన్న, స్వామిరెడ్డి అంజిబాబు, పెనుపోతుల నానిబాబు, కసిరెడ్డి నాగేశ్వరరావు, కనకం అశోక్,నాయకులు జనసైనికులు తదితరులు పాల్గొన్నారు.