ఐఐటీ, ఎన్ఐటీ అభ్యర్థులకు గుడ్‌న్యూస్‌..

ఐఐటీ, ఎన్‌ఐటీ సహా జాతీయ విద్యాసంస్థల్లో ప్రవేశానికి జేఈఈ మెయిన్, అడ్వాన్స్‌ పరీక్షల్లో అర్హత సాధించడంతో పాటు ఇంటర్మీడియెట్‌లో 75 శాతం మార్కులు లేదా జేఈఈలో టాప్‌ 20 పర్సంటైల్‌ సాధించాలన్న నిబంధనను  ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం సడలింపు ఇచ్చింది.

కరోనాతో పలు రాష్ట్రాల్లో ఇంటర్ పరీక్షల నిర్వహణ అస్తవ్యస్తంగా మారింది. విద్యార్థులు కూడా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ క్రమంలో ఈ నిబంధన నుంచి మినహాయింపు ఇస్తూ.. జేఈఈ, జేఈఈ మెయిన్స్‌లో అర్హత సాధించి మెరిట్‌లో ఉన్న అభ్యర్థులకు సీట్లు కేటాయించాలని నిర్ణయించారు. ఇక ఆయా సంస్థల్లో చేరేందుకు అభ్యర్థులు ఆన్‌లైన్‌లో రిపోర్టింగ్‌ చేయవచ్చు. కానీ ధ్రువీకరణ పత్రాల పరిశీలన కోసం ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటు చేస్తారు.

కాగా ఈ నెల 27న జరగనున్న జేఈఈ అడ్వాన్స్ పరీక్ష కోసం ఐఐటీ న్యూఢిల్లీ సోమవారం నుంచి అడ్మిట్ కార్డులను వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచనున్నారు. అందులో అభ్యర్థి పేరు, రోల్‌ నంబర్, ఫొటో, సంతకం, పుట్టిన తేదీ, చిరునామా, సామాజిక వర్గం సరిగా ఉన్నాయో లేదో పరిశీలించుకోవాలి.