పెరిగిన విద్యుత్ చార్జీలపై గోరంట్ల జనసేన ఆధ్వర్యంలో నిరసన

గోరంట్ల, పెరిగిన విద్యుత్ చార్జీలపై గోరంట్ల జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఎమ్మార్వో ఆఫీస్ వద్ద, విద్యుత్ సబ్ స్టేషన్ వద్ద నిరసన చేశారు. ఎన్నికల ముందు తాము అధికారంలోకి వచ్చిన వెంటనే 200 యూనిట్ ల వరకు ఉచిత విద్యుత్ ఇస్తామని చెప్పిన ముఖ్యమంత్రి నేడు అధికారంలోకి రాగానే ఉచిత విద్యుత్ ఇవ్వకపోగా.. విద్యుత్ చార్జీలు పెంచుతూ పోతున్నారు. అలాగే విద్యుత్ కొరత తీవ్రంగా ఉంది దీని వల్ల రైతులు అలాగే గోరంట్ల లోని మర మగ్గల కార్మికులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. దయచేసి ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి విద్యుత్తు చార్జీలు తగ్గించడం తో పాటు రైతులకు 9 గంటల కరెంట్ ఇవ్వాలని గోరంట్ల జనసేన నాయకులు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా వారు ర్యాలీగా వెళ్లి స్థానిక ఎమ్మార్వో కి, విద్యుత్ ఏఈ కి వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి సురేష్, మండల నాయకులు వెంకటేష్, సంతోష్, గొల్ల అనీల్ రాఘవేంద్ర, పి వెంకటేష్, మల్లికార్జున, వీర మహిళ కావేరి, హరి, నరేష్, కృష్ణమూర్తి, తిరుపాల్, పురుషోత్తం రమణ బాబావలి నరేంద్ర తదితరులు పాల్గొన్నారు.