చేనేత కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలి: కాసా రవిప్రకాష్

ఎమ్మిగనూరు, నియోజకవర్గ ఇంచార్జ్ రేఖ గౌడ్ సూచనల మేరకు ఎమ్మిగనూరు నియోజకవర్గం జనసేన పార్టీ కార్యాలయం నందు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జనసేన పార్టీ రాష్ట్ర చేనేత వికాస్ రాష్ట్ర కార్యదర్శి కాసా రవిప్రకాష్ మాట్లాడుతూ ఇటీవలే కృష్ణాజిల్లా పెడన నియోజకవర్గం పెడన పట్టణం 17వ వార్డులో సామూహిక ఆత్మహత్యకు పాల్పడిన పద్మనాభం చాలా బాధాకరమని ఆవేదనని వ్యక్తపరిచారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలో వచ్చిన రోజు నుంచి చేనేత పరిశ్రమ అన్ని పూర్తిగా విస్మరించడం వల్ల చేనేత కార్మికులు ఆత్మహత్యాయత్నానికి పాల్పడుతున్నారని అన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం చేనేత రంగంపై దృష్టి సారించి కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కారం చేసే విధంగా అడుగు వేయాలని, అదేవిధంగా కేవలం మగ్గం వేసే కార్మికుల కాకుండా ప్రతి ఒక్క చేనేత కులానికి సంబంధించిన వ్యక్తులు గుర్తించే విధంగా ప్రణాళికలు రచించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించిన పథకాలు అందేవిధంగా చర్యలు తీసుకుంటూ స్వయంకృషితో ఎదిగుతున్న చేనేత రంగానికి అవకాశాల కలిపి ఇయ్యాలని, చేనేత రంగాన్ని ప్రభుత్వంలో భాగస్వామ్యం చేసుకుంటూ చేనేత కార్మికులకు ప్రభుత్వ ఉద్యోగం వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని జనసేన తరుపున డిమాండ్ చేశారు.