ఘనంగా వడ్రాణం మార్కండేయ బాబు జన్మదిన వేడుకలు

గుంటూరు అరండల్ పేట 10 వ లైన్ లో జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి వడ్రాణం మార్కండేయ బాబు పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగినాయి. అనంతరం అమ్మ వృద్ధాశ్రమంలో పండ్లు పంపిణీ చేసారు. ఈ సందర్భంగా మార్కండేయ బాబు మాట్లాడుతూ మీరందరూ నాపై చూపిన ప్రేమకు సర్వదా కృతజ్ఞతలు అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి ఉప్పు వెంకట రత్తయ్య, జిల్లా కార్యదర్శి మత్తి భాస్కరరావు, గుంటూరు నగర ఉపాధ్యక్షుడు చింతా రేణుకారాజు, నగర ప్రధాన కార్యదర్శి సూరిశెట్టి ఉదయ్, నగర కార్యదర్శి గాదె లక్ష్మణరావు, నగరం కార్యదర్శి బోమ్మగంటి కవిత 47 వ డివిజన్ అధ్యక్షుడు విజయ్, జనసేన నాయకులు కారుమంచి కోటేశ్వరరావు, దోడ్డా వినయ్ గూడపాటి శ్రీనివాసరావు, గోవాడ శ్రీనివాసరావు, సుబ్బారావు, వీరమహిళలు శనక్కాయల హైమావతి, సంకటి హరిసుందరి, మేకల సామ్రాజ్యం తదితరులు పాల్గొన్నారు.