ఘనంగా హరిబాబు రాయల్ జన్మదిన వేడుకలు

ఆత్మకూరు: మర్రిపాడు మండల జనసేన పార్టీ ఆధ్వర్యంలో కువైట్ జనసేన పార్టీ సభ్యులు హరిబాబు రాయల్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా మర్రిపాడు మండల కేంద్రంలో ఎస్సీ కాలనీ లో హరి బాబు రాయల్ జన్మదినం సందర్భంగా కేక్ కట్ చేసి 100 మందికి అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి మండల అధ్యక్షురాలు ప్రమీలా ఓరుగంటి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు జనార్దన్, కృష్ణా, కుమార్, శ్యామ్ కుమార్, పెంచలయ్య, రమణ, చిన్నా జనసేన పాల్గొన్నారు.