శ్రీమతి తమిళిసై సౌందరరాజన్ కి జన్మదిన శుభాకాంక్షలు

తెలంగాణ రాష్ట్ర గవర్నర్ శ్రీమతి తమిళిసై సౌందరరాజన్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ ఒక ప్రకటన విడుదల చేశారు. ఉన్నత ఆశయంతో ప్రజాజీవితంలోకి ప్రవేశించిన శ్రీమతి తమిళిసై గారు ప్రజలకు ప్రత్యక్షంగా, పరోక్షంగా అందిస్తున్న సేవలు ఆమెలోని సేవా గుణానికి నిదర్శనం. వారికి సంపూర్ణ ఆయురారోగ్యాలను, సేవా తత్వాన్ని ద్విగుణీకృతం చేసేందుకు మరింత శక్తిని ప్రసాదించాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నానని జనసేనాని పేర్కొన్నారు.