కొత్తపేట నియోజకవర్గ ప్రజలకు,భారతదేశ ప్రజలందరికీ రాజ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలు!

భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కు జోహార్లు! బండారు శ్రీనివాస్ జనసేన పార్టీ ఇంచార్జ్!

తూర్పు గోదావరి జిల్లా, కొత్తపేట నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ బండారు శ్రీనివాస్ భారత రాజ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలు కొత్తపేట నియోజకవర్గం ప్రజలందరికీ తెలియజేశారు, ప్రపంచ దేశాల్లో భారత రాజ్యాంగం ఎంతో పటిష్టమైనదని, మన భారత రాజ్యాంగం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ నిర్మాతగా భారతదేశాన్ని ప్రపంచ దేశాలకే ఒక ఆదర్శవంతమైన రాజ్యాంగంగా నిర్మించారని, భారత రాజ్యాంగం నిర్మించిన అత్యంత మేధావి, చదువులమ్మ తల్లి ముద్దుబిడ్డ, భరతమాత ముద్దుబిడ్డ, భారత దేశ కోహినూరు వజ్రం లాంటిరత్నం, ఈ దేశానికి గర్వకారణం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అని, రాజ్యాంగ నిర్మాణం సందర్భంగా శుభాకాంక్షలు నియోజకవర్గ ప్రజలకు, మహిళలకు, జన సైనికులకు, దళిత నాయకులకు, బీసీ నాయకులకు, అన్ని వర్గాల నాయకులకు, అన్ని వర్గాల ప్రజలందరికీ, ధన్యవాదాలు తెలియజేశారు.