మూడేళ్లలో ఒక్క కోటి రూపాయలైనా అమ్మవారి ఆలయ ఖాతాకు మళ్ళించారా..?: పోతిన మహేష్

• సిబ్బందికి కోటి రూపాయలు, అమ్మవారి భక్తులకు 20 లక్షలతో భోజనాలు ఇంత అన్యాయమా
• అమ్మవారి దసరా ఉత్సవాల్లో సామాన్య భక్తులకి పెద్దపీట వేస్తామని ప్రకటనలు చేస్తూ విఐపి లకు ఎర్రతివాచీ పరుస్తున్నారు.
• లిఫ్ట్ సౌకర్యం వృద్ధులకు మహిళలకు దివ్యాంగులకు కల్పించాలి.
• అమ్మవారి భక్తులకు ప్యాకెట్లలో భోజనం సిబ్బందికి విందు భోజనమా?
జనసేన పార్టీ విజయవాడ నగర అధ్యక్షులు, రాష్ట్ర అధికార ప్రతినిధి మరియు పశ్చిమ నియోజకవర్గ ఇన్చార్జి పోతిన వెంకట మహేష్ శుక్రవారం తన కార్యాలయం నుంచి విడుదల చేసిన వీడియోలో మాట్లాడుతూ అమ్మవారి దసరా ఉత్సవాల్లో సామాన్య భక్తులకి పెద్దపీట వేస్తామని ప్రకటనలు చేస్తూ విఐపిలకు ఎర్ర తివాచీ పరుస్తున్నారని, లిఫ్ట్ సౌకర్యం వీఐపీలకు మాత్రమే వేయించడం సమంజసం కాదని, లిఫ్ట్ సౌకర్యం వృద్ధులకు మహిళలకు దివ్యాంగులకు కల్పించాలని, వివిధ శాఖలకు చెందిన 7500 సిబ్బందికి కోటి రూపాయలతో భోజనం వసతి ఏర్పాటు చేస్తూ, అమ్మవారి భక్తులకు 20 లక్షలతో సాంబార్ అన్నం దద్దోజనమాని, అమ్మవారి భక్తులకి సిబ్బందికి ఒకే రకమైన భోజనం ఏర్పాట్లు చేయాలని, అమ్మవారి భక్తులకు ఏర్పాటు చేసే సాంబారన్నమే వివిధ శాఖలకు చెందిన సిబ్బంది కూడా ఏర్పాటు చేయొచ్చు కదాఅని,భక్తుల పైన ఎందుకు ఇంత వివక్ష చూపిస్తున్నారో మంత్రిగారు సమాధానం చెప్పాలని, దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు భోజన సదుపాయం కూడా ఏర్పాటు చేయలేక పోతున్నారా అని, అమ్మవారికి దాతలు ఎంతోమంది అన్నదానం నిమిత్తం ఫిక్స్ డిపాజిట్లు చేశారని, భక్తులకు అన్నదానం ఏర్పాటు చేయడంలో అధికార యంత్రాంగం పూర్తిగా విఫలమైనట్టు కనిపిస్తుందని, టెండర్లు పిలవకుండా కోటి రూపాయల భోజనం కాంట్రాక్టులు పశ్చిమ, సెంట్రల్ ఎమ్మెల్యేల అనుచరులకు కట్టబెట్టిన మాట వాస్తవం కాదా అని, దసరా ఉత్సవాలను రాష్ట్ర పండుగ అంటున్నారు కనీసం కోటి రూపాయలు నిధులైన మంజూరు చేశారా అని,ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అమ్మవారి ఆలయ అభివృద్ధి కోసం 70 కోట్ల రూపాయలు నిధులు మంజూరు చేశామన్నారు మూడేళ్లలో ఒక్క కోటి రూపాయలైనా అమ్మవారి ఆలయ ఖాతాకు మళ్ళించారా సమాధానం చెప్పాలని, శాఖల మధ్య సమన్వయం లోపించిందని, ఈవోని కింద కూర్చోబెట్టి ఉత్సవాల కోసం సమీక్ష చేశారంటేనే లోపం స్పష్టంగా అర్థం అవుతుందని, దసరా ఉత్సవాలకు వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా ప్రభుత్వం అధికారులు తగు చర్యలు తీసుకోవాలని, మంత్రి కొట్టు సత్యనారాయణకి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నామని జనసేన పార్టీ నాయకుల కోసం ఒక విఐపి స్లాట్ ఒక గంట కేటాయించాలని టికెట్లు కొనుక్కొని దర్శనం చేసుకుంటామని మా అభ్యర్థనను పరిగణలోకి తీసుకోవాలని అన్నారు.