ఇచ్చాపురం జనసేన ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం

ఎచ్చెర్ల: శ్రీకాకుళం జిల్లా, కవిటి మండలం, కొజ్జీరియా పంచాయతీ, పాత కోజ్జిరియా గ్రామంలో కిమ్స్ ఆసుపత్రి డాక్టర్లల పర్యవేక్షణలో.. జనసేన రాష్ట్ర జాయింట్ సెక్రటరీ తిప్పన దుర్యోధన రెడ్డి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించడం జరిగింది. ఈ శిబిరంలో సుమారు 350 మంది గ్రామస్తులు పాల్గొని వైద్య పరీక్షలు చేయించుకొని వారి అస్వస్తతలకు ఉచితంగా మందులు పొందదం జరిగింది. వైద్య శిబిరంలో ముఖ్యంగా బీపీ, షుగర్, ఈసీజీ, కంటి పరీక్షలు నిర్వహించారు. తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లు నిర్ధారణ అయిన వారిని (బీపీ, షుగర్, మోకాళ్ళ నొప్పులు, పక్షవాతం, కంటిచూపు లోపం, కిడ్నీ వ్యాదులతో బాదపడుతున్న వారిని) మెరుగైన వైద్యం కోసం కిమ్స్ కు పంపించడం జరుగుతుంది. ఈ కార్యక్రమం కోజ్జిరియా ఎంపీటీసీ అభ్యర్థి లింగరాజు పనపాన ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమంలో ఇచ్చాపురం నియోజకవర్గం సమన్వయకర్త దాసరి రాజు, రాష్ట్ర జాయింట్ సెక్రెటరీ తిప్పన దుర్యోధన రెడ్డి, కోజ్జీరియ జనసైనికులు, గ్రామ పెద్దలు, తదితరులు పాల్గొన్నారు.