IMFL అంటే ఇండియన్ మేడ్ ఫారెన్ లిక్కర్ కాదు, ఇడుపులపాయ మేడ్ ఫారెన్ లిక్కర్

రోడ్ ఆక్సిడెంట్స్ 10 శాతం పెరిగిపోయాయి. వైసీపీ ఎందుకు ఉద్యోగాలు ఇవ్వలేకపోయింది, అమ్మ వడి ఎందుకు ఇవ్వట్లేదు, జీతాలు ఎందుకు పెరగట్లేదు అని అందరూ ఆలోచించాలి. ఈరోజు పెట్టుబడి పెట్టె వ్యవస్థను వైసీపీ చంపేసింది. అమర్ రాజా బ్యాటరీస్, కియా పరిశ్రమలు వైసీపీ పెడుతున్న ఒత్తిడి తట్టుకోలేక వెళ్లిపోయాయి.

అభివృద్ధి లేకపోగా 300 యూనిట్ లు దాటి కరెంట్ వాడుతుంటే రేషన్ కట్ చేసేస్తున్నారు, పంచాయతీలకు నిధులు లేకుండా చేశారు. మధ్య నిషేధం అన్నారు..దాని మీదే ఆదాయం పొందుతున్నారు. వ్యసనాన్ని నియంత్రించగలం గాని, నిర్మూలించలేం…రేట్లు పెంచితే తాగడం మానేస్తారు అని నికృష్ట మాటలు వైసీపీ వాళ్ళు మాట్లాడారు. IMFL అంటే ఇండియన్ మేడ్ ఫారెన్ లిక్కర్ కాదు, ఇడుపులపాయ మేడ్ ఫారెన్ లిక్కర్..25 వేల’ కోట్ల మధ్య ఆదాయం వైసీపీ జేబుల్లోకి వెళ్ళింది. పాఠశాలలు నడపాల్సిన ప్రభుత్వం మద్యం షాపులను నడుపుతుంది.