జనసేన ఆధ్వర్యంలో అంబేద్కర్, బాబు జగజ్జీవన్ రావ్ విగ్రహాల ఆవిష్కరణ

జగ్గంపేట నియోజకవర్గం, జగ్గంపేట మండలం సీతానగరం గ్రామంలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్, బాబు జగజ్జీవన్ రావ్ విగ్రహాలు ఆవిష్కరణ. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిధులుగా జనసేన పార్టీ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు కందుల దుర్గేష్, మహాసేన మీడియా జాతీయ అధ్యక్షులు సరిపెల్ల రాజేష్, జగ్గంపేట నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ పాటంశెట్టి సూర్యచంద్ర, తూర్పుగోదావరి జిల్లా కార్యవర్గ సభ్యులు, మండల అధ్యక్షులు, నాయకులు, వీర మహిళలు మరియు జనసైనికులు పాల్గొనడం జరిగింది.