పోలిశెట్టి చంద్రశేఖర్ ఆధ్వర్యంలో జాతీయ జెండా ఆవిష్కరణ
రామచంద్రపురం నియోజకవర్గం, 75వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా జనసేన పార్టీ ఇంచార్జ్ పోలిశెట్టి చంద్రశేఖర్ ఆధ్వర్యంలో సోమవారం ఉదయం 10 గంటలకు రామచంద్రపురం పట్టణము ముచ్చిమిల్లి రోడ్డు శ్రీ బిల్డింగ్, నియోజకవర్గం జనసేన పార్టీ కార్యాలయం దగ్గర జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలో రామచంద్రపురం నియోజకవర్గం మండల అధ్యక్షులు, కౌన్సిలర్ లు, ఎంపీటీసీలు, సర్పంచ్ లు, వార్డు మెంబర్లు, జనసేన నాయకులు, జనసైనికులు, వీర మహిళలు జాతీయజెండా ఆవిష్కరణ కార్యక్రమం లో పాల్గొనడం జరిగింది.