అంతర్జాతీయ ఆదివాసుల దినోత్సవ వేడుకలలో పాల్గొన్న జనసేన నాయకులు

  • యానాది సంక్షేమ సంఘం ఆహ్వానం మేరకు ఆదివాసులకు అండగా జనసేన నాయకులు దేవర మనోహర.
  • బాహ్య ప్రపంచానికి దూరంగా ఉన్న గిరిజనుల అభివృద్ధి ధ్యేయంగా జనసేన పార్టీ.
  • ఆదివాసుల సంక్షేమం మరచిన ప్రభుత్వం అరణ్యంలో ఆదివాసులను ఎలా పట్టించుకోవడం లేదో అలానే వారి సమస్యను గాలికి వదిలేస్తున్న ప్రభుత్వం.

అంతర్జాతీయ ఆదివాసుల దినోత్సవం వేడుకలో భాగంగా, యానాది సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో చంద్రగిరి టవర్ క్లాక్ వద్ద శ్రీ కొమరం భీమ్ మరియు శ్రీ అంబేడ్కర్ కు ఘనంగా నివాళులు అర్పించిన జనసేన పార్టీ.

చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలో టవర్ క్లాక్ దగ్గర యానాది సంక్షేమ సంఘం వ్యవస్థాపకులు పరమాల గోపి ఆధ్వర్యంలో జరిగిన అంతర్జాతీయ ఆదివాసుల దినోత్సవం వేడుకలకు ముఖ్యఅతిథిగా హాజరైన దేవర మనోహర్ మరియు జనసేన నాయకులు ఆకేపాటి సుభాషిణి, ఆశా, సంజీవి హరి.

ఈ సందర్భంగా దేవర మనోహర మీడియాతో మాట్లాడుతూ ఆదివాసుల గురించి మరియు వారి సమస్యల గురించి మొట్టమొదటగా గళం వినిపించి, వారి అభివృద్ధి గురించి మాట్లాడిన ఏకైక వ్యక్తి జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు అని తెలియజేశారు, ఆదిలాబాద్ లో గిరిజన సమస్యలను గుర్తించి వారికి అండగా నిలిచి అప్పట్లో పవన్ కళ్యాణ్ గారు చేసిన కృషికి వాళ్ళందరూ పవన్ కళ్యాణ్ గారిని దేవునితో సమానంగా చూసారు.

సంవత్సరాలు గడుస్తున్న ప్రభుత్వాలు ఎన్ని మారుతున్న గిరిజనుల అభివృద్ధి ఎటువంటి మార్పు లేదు వారు ఇప్పటికీ బాహ్య ప్రపంచానికి చాలా దూరంగా అడవుల్లో, సమస్యలతో సతమతమవుతూ గిరిజనులు జీవితం సాగిస్తున్నారు, ఈ ప్రభుత్వంలో ప్రభుత్వ పథకాలు అందడం అనేది ఒక కలలా మిగిలిపోయింది, ఒక ప్రణాళికాబద్ధంగా లేకపోవటంతో గిరిజన సంక్షేమానికి ఎటువంటి అభివృద్ధికి నోచుకోలేదు.

2024లో జనసేన ప్రభుత్వం స్థాపించిన వెంటనే మొదటగా కొమరం భీమ్ గారి పేరుమీద గిరిజనుల సంక్షేమం కొరకు నూతన ప్రణాళికను అమలు చేసి వారిని నవసమాజంలో భాగస్వామ్యులను చేయడమే జనసేన లక్ష్యం అని తెలిపారు.