ఓయూలో డిప్లొమా కోర్సులకు దరఖాస్తుల ఆహ్వానం

హైదరాబాద్ : ఉస్మానియా యూనివర్సిటీ డిప్లొమాలో ఫారెన్ లాంగ్వేజెస్ కోర్సులకు దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఫ్రెంచ్, జర్మన్ కోర్సుల్లో జూనియర్, సీనియర్, అడ్వాన్స్‌డ్ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తున్నట్లు వర్సిటీ అధికారులు వెల్లడించారు. జూనియర్ డిప్లొమా కోర్సులకు ఇంటర్ పాస్ అయి ఉండాలి. సీనియర్ డిప్లొమాలో సీటు పొందాలంటే.. జూనియర్ డిప్లొమాలో 50 శాతం మార్కులు సాధించి ఉండాలి. లేదా గ్రాడ్యుయేషన్‌లో సెకండ్ లాంగ్వేజ్‌లో 50 శాతం మార్కులు సాధించి ఉండాలి. అడ్వాన్స్‌డ్‌లో ప్రవేశం పొందాలంటే.. సీనియర్ డిప్లొమాలో 50 శాతం మార్కులు సాధించాలి. ఈ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఉస్మానియా ఆర్ట్స్ కాలేజీ ఎంట్రెన్స్ ఎగ్జామ్‌ను నిర్వహించనుంది. అర్హత కలిగిన విద్యార్థులు ఆన్‌లైన్‌లో జులై 10వ తేదీ లోగా దరఖాస్తు చేసుకోవచ్చు. ఇతర వివరాల కోసం https://osmaniaerp.com/diplomacourse, http://osmania.ac.in. వెబ్‌సైట్లను సందర్శించొచ్చు. 040-27682302 ఫోన్‌ నంబర్‌ను కూడా సంప్రదించొచ్చు.