దర్షిత్ కుటుంబానికి మనోధైర్యాన్నిచ్చిన డాక్టర్ పిల్లా శ్రీధర్

  • వైద్య ఖర్చుల నిమిత్తం 10,000/- రూపాయలు ఆర్థికసాయం

కాకినాడ జిల్లా, కొవ్వూరు, ప్రాంతం ఏదైనా నియోజవర్గం ఏదైనా సేవే మార్గంగా ముందుకు వెళ్తున్నటువంటి మన పిఠాపురం నియోజకవర్గ జనసేన నాయకులు శ్రీ విష్ణు హాస్పిటల్ అధినేత డాక్టర్ పిల్లా శ్రీధర్ కొవ్వూరు నియోజకవర్గం తాళ్లపూడి మండలం పైడిమెట గ్రామంలో విద్యుద్ఘాతానికి గురి అయ్యి రెండు కాళ్లు కోల్పోయి కాకినాడ జి.జి.హెచ్ లో చికిత్స పొందుతున్న బాలుడు దర్షిత్ విషయం తెలిసిన వెంటనే పిఠాపురం నియోజకవర్గం జనసేన నాయకులు డాక్టర్ పిల్లా శ్రీధర్ ఆసుపత్రి చేరుకొని వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. వారి కుటుంబానికి మేమంటూ ఉన్నామని భరోసా కల్పిస్తూ, వైద్య ఖర్చుల నిమిత్తం 10,000/- రూపాయలు ఆర్థిక సాయం అందజేసి, మెరుగైన వైద్యాన్ని అందించాలని, తన మిత్రులైన డాక్టర్లను ప్రాధేయపడ్డారు. రానున్న రోజుల్లో ధర్షిత్ కుటుంబానికి ఒక అన్నలా ఏ కష్టం వచ్చినా నాకు తెలియపరచాలని కుటుంబ సభ్యులకుచెప్పడం జరిగింది. బాలుడికి ప్రభుత్వం మెరుగైన వైద్యం అందించి పూర్తి ఆరోగ్యవంతంగా కొలుకునే వరకు ఆదుకోవాలని డాక్టర్ పిల్లా శ్రీధర్ తెలిపారు. జనసేన నాయకులు డా.పిల్లా శ్రీధర్ మాట్లాడుతూ ఎన్నో సార్లు విద్యుత్ వైర్లు సరిచేయాలని బాలుడి తల్లిదండ్రులు అధికారుల దృష్టికి తీసుకువెళ్లినా, నిర్లక్ష్యంతో వ్యవహరించడం వల్లే బాలుడు ఈ దుస్థితి కారణం అని మండిపడ్డారు. సంబంధిత అధికారులపై ప్రభుత్వం చర్యలు తీసుకుని ఉన్నత విద్యను అభ్యసించేందుకు దర్షిత్ కు ప్రభుత్వం సహకరించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మత్సకార నాయకులు కంబాల దాసు, మత్స్యకారు నాయకులు పల్లెటి బాపన్నదొర, వీరమరెడ్డి అమర్, వేలుపుల చక్రధర్, పల్నాటి మధు, బుద్దాల సత్తిబాబు, పి కుమార్, దుడ్డు రాంబాబు పిల్ల శివశంకర్, డి సింహాచలం, బొండాడు జయరాజు మరియు జనసైనికులు పాల్గొనడం జరిగింది.