రాష్ట్రంలోనే అతిపెద్ద స్కాం జగనన్న కాలనీలు

  • జగనన్న కాలనీల పేరిట పేదవాడికి జరుగుతున్న మోసం.

ఏలూరు, జనసేన పార్టీ కార్యాలయంలో శుక్రవరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రెడ్డి అప్పల నాయుడు మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో టిడ్కో ఇళ్లు నిర్మాణం చేసిన లబ్దిదారులకు ఇవ్వకపోవడం శోచనీయం అని రెడ్డి అప్పల నాయుడు ప్రభుత్వాన్ని విమర్శించారు. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఇచ్చిన పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న టిడ్కో ఇళ్ల నిర్మాణం ఎంత వరకు వచ్చిందని పర్యవేక్షించి వాటి వివరాలు అందజేయాలని ఈ నెల 12, 13, 14 వ తేదీలలో నియోజకవర్గాల్లో ఉన్న జగనన్న కాలనీలు మరియు టిడ్కో ఇళ్ల సముదాయాలను సందర్శించి ఆ సందర్భంగా ఒక్కొక్క కాలనీలో ఎన్నిఇళ్లు ఎంతమంది లబ్ధిదారులకు మంజూరయ్యాయో అని ఎన్ని విడతలు ప్రభుత్వం విధించిందని అలాగే ఎంతనిధులు అందజేశారని బేస్మేంట్, లింటల్, రూఫ్ దశల్లో ఎన్ని ఇళ్లు ఉన్నాయో పరిశీలించాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నియోజకవర్గ ఇంచార్జీలకు పిలుపునిచ్చారు. అందులో భాగంగా టిడ్కో ఇళ్ల నిర్మాణం పూర్తైన కూడా ఎందుకు లబ్దిదారులకు ఈ జగన్ రెడ్డి ప్రభుత్వం అందించలేదని ఇప్పటికే గత ప్రభుత్వ హయాంలో టిడ్కో ఇళ్ల లబ్దిదారులు ప్రభుత్వానికి 50 వేలు రుసుం చెల్లించి దాదాపు 5 సంవత్సరాలు కావస్తున్నాయని పూర్తైన టిడ్కో ఇళ్లు ప్రారంభ దశలోనే శిధిలావస్థకు వస్తున్న ఈ జగన్ రెడ్డి ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవడం లేదో అర్థం కాని విధంగా ఉన్నది. అసలే పేదలు వాళ్ళు సొంత ఇంటి కల కోసం 50వేల రూపాయల నగదును అప్పుచేసి ప్రభుత్వానికి కట్టగా అసలు కన్న వడ్డీ ఎక్కువై మరింత పేదరికానికి నెట్టివేయబడుతున్నారు. తక్షణమే జగన్ రెడ్డి ప్రభుత్వం దీనిపై స్పందించి లబ్దిదారులు ఎవరైతే ఉన్నారో వారికి వెంటనే అందించాలని రెడ్డి అప్పల నాయుడు వైసీపీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మరోపక్క ప్రజాధనాన్ని వృధాచేస్తూ 20లక్షల రూపాయల విలువైన భూములను 60, 70 లక్షలకు కొన్నట్లు లెక్కలు చూపిస్తూ మరియు ఆ ప్రదేశంలో మరమ్మత్తులు చేయుటకు మరింత ప్రజాధనాన్ని వృధా చేశారు. కనీసం కాలనీల్లో మౌళిక సదుపాయాలు కూడా కల్పించలేని సిగ్గులేని ప్రభుత్వానికి బుధ్ధి చెప్పేలాగా జనసేన పార్టీ 12, 13 తేదీల్లో టిడ్కో ఇళ్లు మరియు జగనన్న కాలనీలు పరిశీలించడానికి జనసేన పార్టీ ద్వారా జగనన్న ఇళ్ళు పేదలందరికీ కన్నీళ్ళు అనే కార్యక్రమం నిర్వహించబోతున్నారు. అలాగే 14 వ తేదీన డిజిటల్ క్యాంపైనింగ్ ద్వారా సోషల్ మీడియా లో #jaganannaMosam అనే కార్యక్రమం నిర్వహించి జగనన్న కాలనీలు మరియు టిడ్కో ఇళ్లు నిర్మాణం పరిస్థితులు ఏవిధంగా ఉన్నాయో ప్రజలకు అర్థం అయ్యే విధంగా వివరించడానికి టిడ్కో ఇళ్ల పరిస్థితి ప్రజలకు తెలియజేసే విధంగా జనసేన పార్టీ టిడ్కో ఇళ్ల పరిశీలనకు వెళ్ళనున్నామని ఇంచార్జీ రెడ్డి అప్పల నాయుడు తెలిపారు. అనంతరం ఆదివారం నాడు జగనన్న కాలనీలలో నిర్మాణాలు ఏవిధంగా జరుగుతున్నాయో పరిశీలించి ప్రజలకు తెలియజేసే బాధ్యత జనసేన పార్టీ తీసుకుంటుందని రెడ్డి అప్పల నాయుడు తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు హోటల్ గ్రాండ్ ఆర్య అధినేత రాఘవయ్య చౌదరి, జనసేన నాయకులు మాజీ డిప్యూటీ మేయర్ శిరిపల్లి శివరామకృష్ణ ప్రసాద్, పోణంగి బాబు, ఎమ్.ఆర్.ఓ.గుబ్బల నాగేశ్వరరావు, జిల్లా సంయుక్త కార్యదర్శి ఓబిలిశెట్టి శ్రావణ్ కుమార్ గుప్తా, నగర అధ్యక్షుడు నగిరెడ్డి కాశీ నరేష్, ఉపాధ్యక్షుడు బొత్స మధు, అధికార ప్రతినిధి అల్లు సాయి చరణ్, సోషల్ మీడియా కో ఆర్డినేటర్ జనసేన రవి, జాయింట్ సెక్రటరీ ఎట్రించి ధర్మేంద్ర, నాయకులు నిమ్మల శ్రీనివాసరావు, కందుకూరి ఈశ్వరరావు, బొద్దాపు గోవిందు తదితరులు పాల్గొన్నారు.