ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల్ని మోసం చేసిన జగన్మోహన్ రెడ్డి: ఎం హనుమాన్

విజయవద: రాష్ట్ర బీసీ నాయకుడు మరియు న్యాయవాది ఎం హనుమాన్ మాత్లాడుతూ ఇస్తా అన్న హామీలను కనీసం 20% కూడా నెరవేర్చని జగన్మోహన్ రెడ్డి కేవలం ప్రజల్ని మోసం చేసి పథకాల పేరుతో ప్రజలతో ఆడుకున్న జగన్మోహన్ రెడ్డికి 2024 లో ప్రజలు అందరూ కలిసి సరైన సమాధానం చెప్తారు. జగన్మోహన్ రెడ్డి చేసిన దొంగ హామీలు ఒకటి కాదు రెండు కాదు 1) పేదలందరికీ ఉచితంగా ఇల్లు ఇస్తానని చెప్పి కనీసం 10% కూడా పేదలకు ఇల్లు ఇవ్వలేని పరిస్థితి జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం. 2) సిపిఎస్ రద్దు అని చెప్పారు. 3)కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు రెగ్యులేషన్ చేస్తా అని చెప్పారు
4) ప్రత్యేక హోదా ఎక్కడ అధికారులకు వస్తే కేంద్ర ప్రభుత్వం మెడల వంచి ప్రత్యేక హోదా తీసుకొస్తానని చెప్పిన ప్రభుత్వం ఈరోజు గాల్లో మాట్లగా కొట్టు పడేసింది
5) పోలవరం ప్రాజెక్ట్ ఎక్కడ కనీసం పోలవరం ప్రాజెక్ట్ దాని ముగింపు ఎప్పుడో కూడా క్లారిటీగా చెప్పలేని ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఆనాడు అసెంబ్లీలో 2021 కల్లా కంప్లీట్ చేస్తానని చెప్పిన అనిల్ కుమార్ యాదవ్ అప్పుడు ఇరిగేషన్ మినిస్టర్ పోలవరం ప్రస్తావనే ఈరోజు రాని పరిస్థితి. 6) ఆర్టీసీ బస్సు చార్జీలు బాదుడే బాదుడు బస్ ఛార్జీలు అధికంగా పెంచి ప్రయాణికులకు కనీసం సురక్షిత భద్రత లేని ఏపీఎస్ఆర్టీసీ కేవలం జగన్మోహన్ రెడ్డి గారు బస్ ఛార్జీలు పెంచి ఖజానా కోసమే ఈ రోజున ఏపీఎస్ఆర్టీసీ పనిచేస్తుంది. 7) మద్యపానం నిషేధం 9 నవరత్నాల్లో ఒక నవరత్నమైన మద్యపానం నిషేధం కూడా జగన్మోహన్ రెడ్డికి చేతకాలేదని మరొకసారి రుజువయింది మద్యపాన నిషేధం దశలవారీగా తగ్గించుకుంటూ వస్తారని చెప్పిన ప్రభుత్వం ఈరోజు దశలవారీగా రేట్లు మద్యపానం రేట్లు పెంచుకుంటూ పోతున్న అంశం ప్రజలందరూ గమనిస్తున్నారు
8) కరెంట్ కోతలు కరెంట్ బిల్లు ఎందుకు పెంచారు. 9) ఎస్సీ ఎస్టీ మహిళలకు 45 ఏళ్లకే పెన్షన్ ఇస్తామని చెప్పి ఇప్పుడు ఎందుకు ఇవ్వడం లేదు. 10) రేషన్ ద్వారా సన్నబియ్యం ఇస్తామని చెప్పి ఇప్పుడు ఎందుకు ఇవ్వడం లేదు దీనికి జగన్మోహన్ గారు సమాధానం చెప్పాలి. 11) కొత్త పరిశ్రమలు గాని కొత్త ఉద్యోగాలు గాని ఎక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎంత మంది నిరుద్యోగులు ఈ రోజున ఇబ్బంది పడుతున్నారు అంటే ఇది జగన్మోహన్ రెడ్డి గారు చేసిన నిర్లక్ష్మీ అనే తెలుస్తుంది. 12) ప్రతి ఏడాదిలో జనవరిలో నిరుద్యోగుల కోసం జాబ్ క్యాలెండర్ లిస్ట్ చేస్తా అని చెప్పిన జగన్ మోహన్ రెడ్డి గారు మూడు సంవత్సరాలు గడిచిన సరే ఒక్క జాబ్ క్యాలెండర్ కూడా రిలీజ్ చెయ్యని పరిస్థితి
13) తన సొంత పట్టణంలో కడప జిల్లాలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేస్తానని చెప్పిన జగన్ మోహన్ రెడ్డి స్టీల్ ప్లాంట్ పరిస్థితి ఏంటి తన సొంత జిల్లాకే స్టీల్ ప్లాంట్ తెచ్చుకోలేని పరిస్థితి జగన్ మోహన్ రెడ్డి ఇలాంటి నాయకుడు మన రాష్ట్రంలో ఉంటే అభివృద్ధి ఎక్కడ జరుగుతుంది. ఇలా చెప్పుకుంటూ పోతే జగన్మోహన్ రెడ్డి గారి చేసిన దొంగ హామీలు గురించి రోజు సరిపోదు.. కేవలం ప్రజలను మోసం చేసి అధికారులకు వచ్చిన జగన్మోహన్ రెడ్డి 2024లో ఇలాంటి దొంగ హామీలను ప్రజలు గుర్తిస్తారు. వ్యతిరేకత మీకు చూపించి జనసేనకు పూర్తి మద్దతు తెలుపుతారని ఆశిస్తున్నామని ఎం హనుమాన్ జనసేన రాష్ట్ర బీసీ నాయకుడు మరియు న్యాయవాది అన్నారు.