చిత్తూరులో సమస్యలు పరిష్కరించాలని జనసేన డిమాండ్

చిత్తూరు, జనసేన పార్టీ చిత్తూరు జిల్లా అధ్యక్షులు పసుపులేటి హరిప్రసాద్ సూచనలమేరకు చంద్రగిరి నియోజకవర్గంలోని సమస్యల మీద కుప్పం పర్యటనకు విచ్చేసిన ముఖ్యమంత్రికి మీడియా ముఖంగా వినతి చేసిన నియోజకవర్గ నాయకులు, చిన్నగొట్టిగల్లు మండలంలో గిట్టుబాటు ధర మరియు ఇతర రైతు సమస్యలతో పాటు, తిరుపతి రూరల్ లోని ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుచానూరులో బస్టాండ్ సమస్యతో పాటు చంద్రగిరి మరియు తిరుపతి రూరల్ లోని వరదల్లో కొట్టుకుపోయిన వంతెనల శాశ్వత నిర్మాణంలాంటి సమస్యలు కోకొల్లలు, స్థానిక మ్మెల్యేతో పాటు సీఎంని ఈ సమస్యల మీద దృష్టిసారించాలని కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శులు కలప రవి, బీగల అరుణ, మండల అధ్యక్షులు వెంకట్ రాయల్, బొమ్మల కిషోర్, యశ్వంత్, ఉపాధ్యక్షులు మంజుల, రాంబాబు, రాకేష్ ఇతర ముఖ్య నాయకులు పాల్గొనడం జరిగింది.