రామదాసుపేటలో జనసేన మ్యానిఫెస్టో ప్రజలకు వివరించిన కరిమజ్జి

శ్రీకాకుళం జిల్లా, ఎచ్చెర్ల నియోజకవర్గం, రణస్థలం మండలం రామదాసుపేట గ్రామం సోమవారం ఎచ్చెర్ల నియోజకవర్గం సీనియర్ నాయకులు మరియు సోసైటి బ్యాంకు మాజీ చైర్మన్ కరిమజ్జి.మల్లీశ్వరావు పల్లె పల్లెకు అలుపు ఎరుగని ప్రచారం చేస్తూ జనసేన మ్యానిఫెస్టో మరియు సిద్దాంతాలు ప్రజల్లోకి తీసుకు వెళ్లి తున్నారు. ప్రజలకు అర్ధమైన రీతుల్లో వివరిస్తూ పవన్ కళ్యాణ్ గారు గెలిచినట్లు అయితే సంవత్సరానికి 5గ్యాస్ సిలిండర్ల ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. తెల్లరేషన్ కార్డుదారులకు ఇల్లు కట్టుకోవడానికి ఇసుక ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. వ్యవసాయం చేసిన రైతులకు పెన్షన్ సౌకర్యం కలదు. వృద్దులకు వృద్ధాశ్రమం నిర్మించడం జరుగుతుంది. పవన్ కళ్యాణ్ గారు ప్రజల పక్షాన నిలబడిన నాయకుడు కాబట్టి అలాంటి నాయకుడుని గెలుపించుకోలసిన బాధ్యత మనపైన ఉందని అలాగే ప్రతి పల్లెకు ప్రతి గ్రామానికి ప్రతి గడపకి నిత్యం ప్రజల దగ్గరకి వెల్లడం జరుగుతుంది. మేము 560 ఇల్లకు మరియు 76చెరువులు దగ్గరకు వెల్లి ఉపాధి కూలీలతో జనసేన మేనిఫెస్టో వివరించడం జరిగింది. ఈ కార్యాక్రమంలో రణస్థలం మండలం కృష్ణాపురం పంచాయతీ జనసేన పార్టీ యంపిటీసి అభ్యర్థి పోట్నూరు లక్ష్మునాయుడు పవనన్న ప్రల్లెబాట ప్రారంభించి 91వరోజు సుదీర్ఘంగా ప్రజల దగ్గరకి వెళ్లి పలు కుటుంబాలను కలిసి మేనిఫెస్టో గురించి వివరంగా చెప్పడం జరిగింది. పవనన్న ప్రజాబాట తాము ప్రారంభించిన ప్రజలనుండి అపూర్వమైన స్పందన లభిస్తోందన్నారు. గత ఎన్నికల సందర్భంగా ఒక్క ఛాన్స్ జగన్ కి ఇచ్చాం అని ఓటేసిన వారెవరూ ఈసారి వైసీపీకి ఓటు వేసేందుకు సిద్ధంగా లేరన్నారు. ఈ కార్యక్రమంలో నవీన్, చంద్రశేఖర్, మల్లన్న, సీతమ్మ, సరస్వతి, లచ్చమ్మ తదితరులు పాల్గొన్నారు.