జనంతో జనసేన 22వ రోజు

  • గిరిజన ప్రాంతాల్లో జనసేన నాయకులు పర్యటన
  • బూర్జమనగూడా, సోముదాలవలస గ్రామాలలో జనంతో జనసేన 22వ రోజు

ఆమదాలవలస నియోజకవర్గంలో జనసేన పార్టీ నాయకులు కొత్తకోట నాగేంద్ర, కోరుకొండ మల్లేశ్వరరావు, అంపిలి విక్రమ్(ఎంపీటీసీ) నాయకులు మరియు కొల్ల జయరామ్ ఆధ్వర్యంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆశీస్సులతో జనంతో జనసేన కార్యక్రమంలో భాగంగా 22వ రోజు బూర్జమనగూడా, సోముదాలవలస గ్రామాలలో ఇంటింటికి వెళ్లి జనసేన సిద్ధాంతాలను మరియు రాష్ట్రంలో ఉన్న సమస్యలను ప్రజలకి అర్థమయ్యే విధంగా చెప్పడం జరిగింది. ప్రతి ఒక్కరి జీవితాలు బాగుండాలి, మన రాష్ట్రం అభివృద్ధి చెందాలి అంటే భవిష్యత్తులో వచ్చే ఎన్నికల్లో జనసేన పార్టీని ఆదరించి, గాజు గ్లాస్ గుర్తుకి ఓటు వేసి, జనసేన పార్టీని గెలిపించవలసిందిగా ప్రతి ఒక్కరిని పేరుపేరునా కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు కొత్తకోట శ్రీనివాసరావు, సైరుగాపు సంతోష నాయుడు, మోహన్, జనసేన కార్యకర్తలు, మరియు గ్రామ ప్రజలు పాల్గొని విజయవంతం చేసినందుకు ప్రతి ఒక్కరికీ పేరు పేరునా ధన్యవాదాములు తెలియజేసుకుంటున్నామని తెలిపారు.