జనసైనికుని కుటుంబానికి అండగా నిలిచిన జనసైనికులు

  • బండారు,రాచకొండ చేతులు మీదుగా భార్య పిల్లలకు 1,00,000 రూపాయల బాండు,14,500 నగదు అందజేత

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, రావులపాలెంలో సాటి జనసైనికుడు మృతి చెందడంతో మానవత్వం చాటుకుంటూ అతని భార్య పిల్లలకు అండగా నిలిచిన జనసైనికులు. మండల పరిధిలోని ఈతకోట గ్రామంలో ఇటీవలే అనారోగ్యంతో గళ్ళ సత్యనారాయణ (పండు) చిన్న వయసులోనే కాలంచేయడంతో ఆర్థికంగా వెనుకబడిన కుటుంబం, ఇద్దరు చిన్నపిల్లలతో ఇబ్బంది పడుతున్నారు. విషయం తెలుసుకున్న గ్రామంలోని జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, వీరమహిళలు అందరు కలిసి ఆ కుటుంబానికి అండగా మేమున్నాం అంటూ అందరి సహాయ సహకారాలతో 1,14,500 రూపాయలు సమకూర్చారు. సత్యనారాయణ పిల్లల పేరు మీద లక్ష రూపాయల ఫిక్సిడ్ డిపాజిట్ చేసి ఆ బాండును 14,500 రూపాయిలు నగదు రూపంలో అవసరాలకు ఆదివారం ఉదయం ఈతకోటలోని గళ్ళ ఇంటి వద్ద జనసేన పార్టీ కొత్తపేట నియోజకవర్గ ఇంఛార్జి బండారు శ్రీనివాస్ మరియు ప్రముఖ వ్యాపారవేత్త, ప్రజా సేవకుడు రాచకొండ శ్రీనివాస్ ఇద్దరి చేతులు మీదుగా పార్టీ శ్రేణులు సమక్షంలో గళ్ళ కుటుంబానికి అందజేశారు. ఈ సందర్భంగా బండారు మాట్లాడుతూ పండు కుటుంబ సభ్యులకు ఎల్లప్పుడూ జనసేన పార్టీ అండగా ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో ఈతకోట గ్రామ జనసేన ఎంపిటిసి బొరుసు సీతారత్నం, మండల అధ్యక్షుడు తోట స్వామి, జిల్లా ప్రధాన కార్యదర్శి తాళ్ల డేవిడ్, జిల్లా కార్యదర్శలు దొంగా వెంకట సుబ్బారావు, బొక్కా ఆదినారాయణ, గ్రామ పార్టీ అధ్యక్షుడు యర్రంశెట్టి రాంమోహన్ రావు(రాము), బొరుసు సుబ్రహ్మణ్యం, మోటురి వెంకట సత్య, నరాలశెట్టి అరుణ, నూకల సీతారత్నం, చిక్కాల శంకరం, జువ్వల యేసు, నంబు ప్రసాద్, బొక్కా శ్రీను, యర్రంశెట్టి కాసు, లక్కకుల సురేష్, తదితరులు పాల్గొన్నారు.