Gajuwaka: 6 నెలల నుండి మూతపడి ఉన్న బోరును 24 గంటలలో బాగుచేయించిన జనసేన కార్పొరేటర్ శ్రీ దల్లి గోవిందరాజు

గాజువాక నియోజకవర్గం 64 వ వార్డు గంగవరం చిన పల్లిపాలెం గ్రామ వాస్తవ్యులు గత ఆరు నెలల నుండి నిత్యం వాడుకునే మంచినీళ్లు బోరు మూతపడిందని 64వ వార్డు కార్పొరేటర్ శ్రీ దల్లి గోవిందరాజు ఫిర్యాదు చేయగా ఆయన స్పందిస్తూ 24 గంటల్లోనే, మీ వద్దకు వచ్చి మంచినీళ్లు బోరుకు సంబంధించిన సామగ్రిని రప్పించి మంచి నీరు అందే విధంగా చేస్తానని వారికి మాట ఇచ్చారు. ఇచ్చినట్లుగానే పని పూర్తి చేశారు. చిన పల్లిపాలెం గ్రామస్తులు కార్పొరేటర్ గోవింద్ రాజుగారు ను స్పందించే నాయకుడిని ఎన్నాళ్ళకు ఇలాంటి నాయకులను చూస్తున్నామని కొనియాడారు. తమ త్రగునీటి సమస్యను తీర్చినందుకు ధన్యవాదాలు తెలియజేశారు. కార్పొరేటర్ శ్రీ దల్లి గోవిందరాజు మాట్లాడుతూ మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ప్రజాస్వామ్య రాజకీయాలు చేస్తున్నారని అదే బాటలో మేము నడుస్తున్నామని… ప్రజల సమస్యలు తీర్చే వాళ్లనే మీరు ఎన్నుకోవాలని… అప్పుడు రాష్ట్రం, గ్రామాలు మరియు భావితరాల భవిష్యత్తు బాగుంటాయని ఆయన చెప్పుకొచ్చారు. అలాగే, కొండపై స్థానిక ప్రజలను సందర్శించారు. అక్కడ పర్యటిస్తూ… సమస్యలు అడిగి తెలుసుకొని ప్రజల వద్దకే పాలన తీసుకొస్తామని మాటలు చెప్పే నాయకులు నమ్మొద్దని. వారితో చెప్పుకొచ్చారు. ఈ కార్యక్రమంలో విశాఖపట్నం జిల్లా మాజీ పార్లమెంట్ అధికార ప్రతినిధి సి హెచ్ ముసలయ్య. మాజీ సోషల్ జస్టిస్ నూకరాజు, మెగా నూకరాజు, దాసుగా, యరబాల అప్పలరాజు, ఆదినారాయణ, ఆనంద్, రాజు, చిట్టిబాబు, భూలోక పెంటయ్య, శ్రీను, ప్రసాదు. తదితరులు పాల్గొన్నారు.