మంత్రి అప్పలరాజు పైన తగిన చర్యలు తీసుకోవాలని జనసేన డిమాండ్

పశుసంవర్ధక శాఖ మంత్రి డాక్టర్ సిదిరి అప్పలరాజు విధుల్లో ఉన్న పోలీసు అధికారులను బహిరంగ ప్రదేశంలో దూషించి విధులు అడ్డుకున్నందుకు నైతిక బాధ్యత వహించి తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలి. రాష్ట్ర డిజిపి మీ శాఖకు సంబంధించిన అధికారుల హక్కుల్ని కాపాడలేకపోతే రాష్ట్ర ప్రజల హక్కులు కావచ్చు, శాంతిభద్రతలు కావచ్చు ఎలా కాపాడుతారు? ఈ సంఘటన పైన విచారణ జరిపి మంత్రి అప్పలరాజు పైన తగిన చర్యలు తీసుకోవాలి డిమాండ్ చేస్తున్నామని అనంతపురం జిల్లా జనసేన ఉపాధ్యక్షులు లాయర్ కుంటిమద్ది జయరామ్ రెడ్డి.