అంధ్రప్రదేశ్ రోడ్ల పై జనసేన పోరాటం

నాగరికతకు చిరునామాగా రహదారులను అభివర్ణిస్తారు. అయితే ఏపీలో ప్రభుత్వం రహదారుల అభివృద్ధిని గాలికొదిలేసింది. కొత్తగా రోడ్లు నిర్మించకపోగా, ఇప్పటికే నిర్మించిన వాటి మరమ్మతులు కూడా చేపట్టక పోవడంతో చాలా రోడ్లు నామరూపాలు లేకుండా పోయాయి. రోడ్లపై అక్కడక్కడా గుంతలు పడటం మనం చూస్తేనే ఉంటాం, కానీ ఏపీలో రోడ్లు మాయమై అన్నీ గోతులే మిగిలాయని జనం విమర్శలు గుప్పిస్తున్నారు. గత ప్రభుత్వం రోడ్లను నిర్లక్ష్యం చేయడం వల్లే ఈ దుస్థితి ఏర్పడిందని ప్రస్తు వైసీపీ ప్రభుత్వం గత ప్రభుత్వంపై నెపం నెట్టే ప్రయత్నం చేస్తోంది. 2019లో కొత్తగా ప్రభుత్వం ఏర్పడినప్పుడు ఇలాంటి మాటలు చెపితే జనాలు కొంత వరకు వినేవారు, కానీ అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు దాటిపోయిన తరవాత కూడా అవే మాటలు చెబుతుంటే జనం నవ్వుకుంటున్నారు. కనీసం వర్షాలకు కొట్టుకుపోయిన, గుంతలు పడ్డ రోడ్లకు కూడా మరమ్మతులు చేయకపోవడంతో రాష్ట్రంలో రోడ్లపై ప్రయాణం నరకప్రాయంగా మారింది. మన రాష్ట్రంలో మొత్తం లక్షా 28 వేల కిలో మీటర్ల రహదారులు ఉన్నాయి. ఇందులో లక్షా 12 వేల కిలోమీటర్లు గ్రామీణ రహదారులు, 14,714 కిలోమీటర్లు రాష్ట్ర రహదారులు, 2,592 కిలోమీటర్లు జాతీయ రహదారులు. జాతీయ రహదారుల నిర్వహణ కేంద్ర ప్రభుత్వం చూసుకుంటుంది. దేశంలోని అన్ని రాష్ట్రాల్లో జాతీయ రహదారుల నిర్మాణం, నిర్వహణ కేంద్ర ప్రభుత్వం లేదా బీవోటీ పద్దతిలో రహదారి నిర్మించిన కాంట్రాక్టర్లు నిర్వహిస్తారు. ఏపీలో జాతీయ రహదారుల పరిస్థితి మెరుగ్గానే ఉందని చెప్పాలి. ఇక రాష్ట్ర రహదారులు అంటే జిల్లాకేంద్రాలను, పట్టణాలను కలుపుతూ వెళ్లే రోడ్లు అన్నమాట. వీటి నిర్మాణం, నిర్వహణ మొత్తం రాష్ర్ట ప్రభుత్వమే చూడాలి. గత రెండేళ్లుగా రాష్ట్ర రహదారుల నిర్మాణం ఆగిపోయింది. రెండేళ్లుగా వర్షాలకు దెబ్బతిన్న రోడ్ల మరమ్మతులు కూడా నిర్వహించకపోవడంతో రాష్ట్ర రహదారులపై ప్రయాణం నరకప్రాయంగా మారింది. ఉదాహరణకు మనం కొన్ని రోడ్లను పరిశీలిద్దాం. ఏపీలో అత్యంత అధ్వానంగా తయారైన రోడ్లలో తాడేపల్లిగూడెం నుంచి కొయ్యలగూడెం రోడ్డు నిలుస్తోంది. ఈ రోడ్డుపై ఎలాంటి వాహనాలు తిరిగే పరిస్థితి లేదు. ఇక రావులపాలెం నుంచి అమలాపురం, నిడదవోలు నుంచి పెరవలి రహదారులు కూడా దారుణంగా తయారయ్యాయి. కంకిపాడు నుంచి భీమవరం, పిడుగురాళ్లనుంచి సత్తెనపల్లి, శ్రీకాళహస్తినుంచి చెన్నై రహదారులు వర్షాలకు నామరూపాలు లేకుండా పోయాయి. మొత్తంగా ఆంధ్రప్రదేశ్ లో ప్రధాన రోడ్లపై ప్రయాణం దుర్భరంగా మారింది. రహదారుల అభివృద్ధి కార్పొరేషన్ పేరుతో పెట్రోల్, డీజిల్ పై లీటరుకు రూపాయి చొప్పున వసూలు చేసి, ఆ మొత్తాన్ని కొత్తగా ఏర్పాటు చేసిన కార్పొరేషన్ ఖాతాలో జమ చేస్తున్నారు. ఆ ఆదాయాన్ని గ్యారంటీగా చూపి బ్యాంకుల వద్ద నుంచి రూ.2000 కోట్ల రుణం తీసుకు వచ్చేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. బ్యాంకులు రుణాలు అందిస్తే ఆ మొత్తంలో కొంత రోడ్ల మరమ్మతులకు వినియోగించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ దిశగా చేస్తున్న ప్రయత్నాలు ఫలించేలా కనిపించడం లేదు. ముందుగా మూడు బ్యాంకులు రుణాలు ఇచ్చేందుకు ముందుకు వచ్చినా, కేంద్రం తాజా
ఆదేశాలతో కార్పొరేషన్లకు రుణాలు ఇవ్వరాదని బ్యాంకులు నిర్ణయించడంతో రోడ్ల మరమ్మతులకు నిధుల కొరత ఏర్పడింది.ఏపి లో రోడ్ ల పరిస్థితి పై పెద్ద ఎత్తున ఉద్యమించిన జనసేనా ని. రోడ్స్ బాగుకోసం గత ప్రభుత్వం పట్టించుకోక పోవటం తో రాష్ట్రంలో రోడ్ లు అధ్వానంగా తయారయ్యాయి. రోడ్ ల కోసం జనసేన అనే నినాదంతో డిజిటల్ ప్లాట్ ఫార్మ్స్ వేదిక గా ఫోటో లు వీడియో షేర్ చేయటం తో పెద్ద ఎత్తున ఉద్యమం మొదలైంది. రోడ్ ల కోసం జనసేన పార్టీ అనే నినాదంతో గత సెప్టంబరు 2,3,4 తేదీల్లో రోడ్ల దుస్థితిని వీడియోలు తీయడం, వాటిని డిజిటల్ వేదికల్లో ప్రదర్శించడంతోపాటు, పెద్ద ఎత్తున ఉద్యమించనున్నట్టు ఆ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ విజయవాడలో మీడియాకు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రోడ్ల కోసం జనసేన పార్టీ అనే నినాదంతో రోడ్ల పరిశీలన పోస్టర్ ను ఆయన విజయవాడలో ఆవిష్కరించారు. పరిస్థితిలో మార్పు లేకుంటే అక్టోబరు 2వ తేదీ అంటే గాంధీ జయంతి నాడు జనసైనికులు శ్రమదానంతో రోడ్లు బాగు చేయతమ్మే కాక పెద్ద ఎత్తున ఉద్యమంలా శ్రమదానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున జనసైనికులు పాల్గొని రాష్ట్ర మొత్తం శ్రమదానం నిర్వహించటం జరిగింది. ఒక సమయంలో పోలీసు లు కలగ చేసుకొని శ్రమదానం కార్యక్రమాని ఆపటానికి శతవిధాల ప్రయత్నించారు కానీ పవన్ కళ్యాణ్ పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది. సభాస ్థలికి వెళ్ళటానికి ఆంక్షలు విధించడంతో జనసేనాని తో పాటు కొద్దీ మందిని మాత్రమే కాన్వాయ్ తో అనుమతించరు. త్వరలోనే రోడ్ ల మరమ్మతులు చేస్తా మని చెప్పిన ప్రభుత్వం, ఇప్పటివరకు ఎటువంటి చర్యలు చేపట్టలేదు. చాలా చోట్ల ఈ రోడ్లు దుస్థితి వల్ల ఆక్సిడెంట్ లే కాక ఆర్టీసీ బస్సులు కూడా బోల్తా పడటం జరుగుతుంది. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి రోడ్ల మరమత్తులు చేపట్టాలని జనసేన కోరుకుంటుంది.