Nellore: కార్పొరేషన్ ఎన్నికలలో నామినేషన్ దాఖలు చేసిన జనసేన
నెల్లూరు నగర కార్పొరేషన్ ఎన్నికలు జరుగనున్న తరుణంలో జనసేనపార్టీ తరుపున నెల్లూరు సిటీ నియోజకవర్గంలోని పలుచోట్ల ఈరోజు జనసేన నామినేషన్ దాహ్కలు చేయడం జరిగింది. 8వ డివిజన్ నుండి శ్రీమతి అమంచర్ల కుసుమలత, 28వ డివిజన్ లో నామినేషన్ వేసిన జిల్లా కార్యదర్శి శ్రీమతి పసుపులేటి వెంకట సుకన్య నామినేషన్ దాఖలు చేయగా 39వ డివిజన్ నుండి శ్రీమతి చెరుకూరి సునంద గారు నామినేషన్ దాఖలు చేశారు. ఈ కార్యక్రమంలో నెల్లూరు జిల్లా జనసేనపార్టీ ఇంచార్జ్ కేతం రెడ్డి వినోద్ రెడ్డి, పార్టీ ప్రధాన కార్యదర్శి గునుకుల కిషోర్ మరియు జనసైనికులు పాల్గొన్నారు.