ముద్దాడ వసంత్ కు అండగా జనసేన ఆర్థికసాయం

ఆమదాలవలస నియోజకవర్గం, ఇటీవల రైలు ప్రమాదంలో గాయపడిన చిన్న లంకాంకు చెందిన జనసైనికుడు ముద్దాడ వసంత్ కు బూర్జ మండలం నాయకులు మజ్జి రాంబాబు, తోట అప్పలరాజుల ఆధ్వర్యంలో జనసైనికులు రూపాయలు 11000/- ఆర్థిక సహాయం అందించారు. మజ్జి రాంబాబు మాట్లాడుతూ ఆపదలో ఉన్న వారికే సహాయం చేయడానికి జనసేన పార్టీ ముందుంటుందని తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో కేత సాయికుమార్, అనుసూరి మన్మధరావు, జయరాం, శేషగిరిరావు, గోపాలకృష్ణ, వీర స్వామి, వాకముడి మణికంఠ, సంతోష్, సాంబ, ఎన్. జయరాం, సి చిన్న, ఎన్ కోటి, బి నవీన్, కె సంతోష్, కె రాజు, కె లక్ష్మణ్ మరియు స్థానిక ప్రజలు జనసైనికులు పాల్గొన్నారు.