మగ్గం గుంతల్లో నీరు చేరకుండా జనసేన సరి కొత్త ఐడియా

*పైలట్ ప్రాజెక్టుగా ఉప్పరపల్లె గ్రామంలో ప్రయోగం

సిద్దవటం, ఒక్క ఐడియా జీవితాన్నే మార్చేస్తుంది అన్న డైలాగ్ గుర్తొస్తోంది కదూ.. ఇలా అనుకుంటే మీరు భ్రమలో పడ్డట్లే.. అవును మరి వర్షాకాలంలో చేనేత మగ్గాల గుంతల్లోకి నీరు చేరి ఇంతకాలం ఆర్థికంగా ఇబ్బందులపడ్డ చేనేత కార్మికులకు వెసులుబాటు కల్పించేందుకు జనసేన పార్టీ కనుగొన్న ఐడియా.. మగ్గం గుంతల్లో నీరు చేరకుండా చేస్తోంది. ఈ మేరకు వివరాలిలావున్నాయి. రాజంపేట జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి మలిశెట్టి వెంకటరమణ ఆదేశాల మేరకు జనసేన రాష్ట్ర చేనేత వికాస కార్యదర్శి రాటాల రామయ్య ఆధ్వర్యంలో.. మంగళవారం సిద్ధవటం మండలంలోని ఉప్పరపల్లె గ్రామంలోని మినుమల వెంకటసుబ్బయ్య అనే చేనేత కార్మికుని గృహంలో మంగళవారం పైలట్ ప్రాజెక్టుగా ప్రయోగం చేపట్టారు. మగ్గం గుంతల్లోకి వర్షపు నీరు ఊట ద్వారా వచ్చి చేరకుండా ఉండేందుకు ఆధునిక పద్దతిలో ప్లాస్టింగ్ చేశారు. ఈ సందర్బంగా జనసైనికులు మాట్లాడుతూ.. మొదటగా కొన్ని మగ్గం గుంతలలో ప్లాస్టింగ్ చేపట్టామని, ఈ ప్రయోగం విజయవంతమయినట్లయితే రాజంపేట నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో ఉన్న చేనేతల మగ్గాల గుంతలకు ప్లాస్టింగ్ చేపడతామని తెలియజేసారు.