Nellore: జిల్లాకో బూతు మంత్రి…!

నెల్లూరు కార్పొరేషన్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయబోతున్న సందర్భంగా జనసేనపార్టీ ఆధ్వర్యంలో కేంద్ర కార్యాలయం నుంచి త్రిసభ్య కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది, ఈ కమిటీలో సభ్యులైన పార్టీ జనరల్ సెక్రటరీ చిలకం మధుసూదనరెడ్డి, సెక్రటరీలు విజయ్ శేఖర్, స్వరూపరాణి, జిల్లా అధ్యక్షులు మనుక్రాంత్ జిల్లా నుంచి నియోజకవర్గాల ఇన్చార్జీలు, నాయకులు, వీరమహిళలు మరియు జనసైనికులతో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ…
📎ప్రతి జిల్లాకి ఒక బూతు మంత్రిని పెట్టిందీ ఈ వైసీపీ ప్రభుత్వం
📎అభివృద్ధిని గురించి ప్రశ్నించినప్పుడల్లా బూతులు తిడుతూ టాపిక్ డైవర్ట్ చేస్తారు.
📎 రాష్ట్ర ప్రజలపై పన్నుల భారం పెరిగి తల్లడిల్లుతున్నారు.
📎 కొత్త పన్నులతో అల్లాడుతున్నారు
📎రాష్ట్రంలో రాక్షసపాలన సాగుతోంది
📎పాలకులు ప్రజల క్షేమం మరిచారు
📎మహిళలకు రక్షణ లేదు
📎ఎంతో ప్రమాదకరంగా ఉన్న సోమశిల డ్యామ్ ని పునరుద్ధరించే ఆలోచన కూడా ఈ ప్రభుత్వానికి లేదు
📎ఈ సమస్యలను దూరం చేయాలన్నా పన్నుల భారం తగ్గించాలన్నా, అభివృద్ధి సాధించాలన్నా జనసేనపార్టీ అధికారంలోకి రావాల్సిందే.
📎రానున్న కార్పొరేషన్ ఎన్నికల్లో జనసేనపార్టీ గెలుపే ధ్యేయంగా వ్యూహరచన జరుగుతుంది
📎పటిష్టమైన కార్యాచరణతో జనసేనపార్టీ కార్పొరేషన్ ఎన్నికల్లో సిద్ధమవుతుంది
📎నెల్లూరు కార్పొరేషన్ ఎన్నికల పోటీకై జనసేన అభ్యర్దుల నుంచి అనూహ్య స్పందన వచ్చిందని తెలిపారు.
📎ఎన్నికల పోటీకై పోటీ పడి అభ్యర్థుల దరఖాస్తులు..54 డివిజన్లకై 126 దరఖాస్తులు
📎అందరి దరఖాస్తులు స్వీకరించి స్క్రీనింగ్ కమిటీ ఆధ్వర్యంలో అభ్యర్థుల పేర్లు త్వరలో ప్రకటించబడతాయి.
📎ఈ సందర్బంగా ఏ అభ్యర్థికి అవకాశం వచ్చినా కార్యకర్తలందరూ గాజు గ్లాసు గెలుపే ధ్యేయంగా జనసేన పార్టీ తరపున ప్రచార కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా పిలుపునిచ్చారు…

ఈకార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి కిషోర్ గునుకుల, నెల్లూరు నగర నాయకులు దుగ్గిశెట్టి సుజయ్ బాబు, రాష్ట్ర కార్యక్రమాల కమిటీ కార్యదర్శి కొట్టే వెంకటేశ్వర్లు, ఉపాధ్యక్షులు సుధీర్ బద్దిపూడి, ప్రధాన కార్యదర్శులు గూడూరు వెంకటేశ్వర్లు, ప్రవీణ్ కుమార్ యాదవ్, మున్వర్ భాష, కార్యదర్శి పసుపులేటి సుకన్య, సంయుక్త కార్యదర్శి షన్వాజ్, యజ్ఞేశ్ సింగ్, అనిల్, అరవ రాజేష్ తదితర నాయకులు, వీర మహిళలు, కార్యకర్తలు మరియు జనసైనికులు పాల్గొన్నారు.