జనసైనికుని కుటుంబానికి అండగా జనసేన

  • జనసైనికుడి అకాల మృతికి జనసేన నాయకుల సంతాపం
  • చోడవరపు పండు కుటుంబాన్ని పరామర్శించిన జనసే నాయకులు
  • 25000 వేలు ఆర్థిక సహాయం అందజేసిన ఉమ్మడి కృష్ణా జిల్లా ఉపాధ్యక్షులు బొలియశెట్టి శ్రీకాంత్, ఉమ్మడి కృష్ణాజిల్లా అధికార ప్రతినిధి మరీధు శివరామకృష్ణ

నూజివీడు నియోజకవర్గం, అగరిపల్లి మండలం పిన్నరెడ్డి పల్లి గ్రామంల గత 10 రోజులు క్రితం యాక్సిడెంట్లో ప్రమాదవశాత్తు చోడవరపు పండు మరణించడం జరిగింది. చోడవరపు పండు మరణించారన్న వార్త వారి కుటుంబంతో పాటు మమ్మల్ని కూడా తీవ్ర ఆవేదనకు గురిచేసిందని జనసేన నాయకులు అన్నారు. చోడవరపు పండు వృత్తి చేసుకుంటూ కూడా జనసేన పార్టీ కి ఎంతో అండగా నిలబడ్డారని, గత ఎన్నికల్లో పార్టీ కి విస్తృతంగా సేవలందించారని, వారు ఇలా అకాలమరణం చెందడం వారి కుటుంబానికి, పార్టీకి తీరని లోటు అని వారి కుటుంబానికి కృష్ణా జిల్లా జనసేన పార్టీ నుండి ప్రగాఢ సంతాపాన్ని తెలియజేసారు. జనసేన పార్టీ ఎల్లప్పుడూ చోడవరపు పండు వారి కుటుంబానికి అండగా ఉంటుందని చోడవరపు పండు పిల్లలు చదువుకోవడానికి తనవంతు సహాయం చేస్తానని జనసేన కార్యకర్త పండు మరణ వార్త జనసేనపార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్, పిఏసి చైర్మన్ నాదెండ్ల మనోహర్ మరియు కృష్ణాజిల్లా జనసేనపార్టీ అధ్యక్షులు బండ్రెడ్డి రామకృష్ణ ల దృష్టికి తీసుకొని వెళ్లి పార్టీ తరుపున ఆ కుటుంబానికి న్యాయం చేసేటట్టు ప్రయత్నం చేస్తానని ఉమ్మడి కృష్ణా జిల్లా ఉపాధ్యక్షులు బొలియశెట్టి శ్రీకాంత్ అన్నారు. జనసేపార్టీ వారి కుటుంబానికి అండగా ఉంటుందని జనసైనికులు కొందరు కలిసి తక్షణ సాయంగా రూ .25000 /- వారి కుటుంబానికి ఉమ్మడి కృష్ణా జిల్లా ఉపాధ్యక్షులు బొలియశెట్టి శ్రీకాంత్, ఉమ్మడి కృష్ణాజిల్లా అధికార ప్రతినిధి మరీధు శివరామకృష్ణ అందజేశారు. ఈ కార్యక్రమంలో నూజివీడు మండలం అధ్యక్షులు యర్రంశెట్టి రాము, వీర మహిళ నాగమణి, ఆగిరిపల్లి మండలం నాయకులు ముక్కు మహేష్ కాలా సింహాచలం, తాళ్లూరి చంటి, తరుణ్ తేజ, మలవల్లి ప్రసాద్, మల్లవల్లి కిరణ్, అలాగే పిన్నారెడ్డిపల్లి గ్రామం జనసైనికులు సువర్ణ బాబు, విజయ్, వెంకటేశ్వరావు తదితరులు పాల్గొన్నారు.