ప్రజా గళం సభకు భారీగా జనసేన నాయకులు, కార్యకర్తలు
- పవన్ కళ్యాణ్ జిందాబాద్ అంటూ నినాదాలు
నంద్యాల: నంద్యాలలో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు చేపట్టిన ప్రజా గళం బహిరంగ సభకు జనసేన నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో హాజరయ్యారు. నంద్యాల పట్టణం రాజ్ థియేటర్ సమీపంలో పార్లమెంట్ అభ్యర్థి బైరెడ్డి శబరి, ఎమ్మెల్యే అభ్యర్థి ఎన్.ఎం.డి.ఫరూక్ ఆధ్వర్యంలో ప్రజా గళం బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా జన సేన నాయకులు రాచమడుగు చందు, సుందర్, గురు ఆద్వర్యంలో జనసేన కార్యకర్తలు పట్ట పుర వీధుల గుండా పవన్ కళ్యాణ్ జిందా బాద్, రాష్ట్ర ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు రావాలని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పొత్తులో భాగంగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల విజయానికి కృషి చేశామని అన్నారు. పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు జన సేన సైనికులు పొత్తు కుదిరినప్పటి నుంచి పట్టణ, గ్రామీణ ప్రాంతాలలో ప్రచారంలో చురుకుగా పాల్గొన్నామని అన్నారు. ఎన్నికల ప్రచారంలో చివరి రోజు కావడంతో బహిరంగ సభకు నారా చంద్రబాబు నాయుడు రావడం, ఆయన రాష్ట్ర భవిషత్తు, అభివృద్ధిపై చేసిన ప్రసంగం అందరినీ ఆకట్టుకుందని అన్నారు. బాబు, పవన్ కళ్యాణ్ లతో అభివృద్ధి జరుగుతుందని అన్నారు. ఉద్యోగాలు రావాలంటే బాబు రావాలని అన్నారు. ప్రతి ఒక్కరూ నంద్యాలలో తెలుగుదేశం అభ్యర్థులను గెలిపించాలని కోరారు.