ముంపుకు గురైన ప్రాంతాల్లో జనసేన నాయకులు పర్యటన

కోనసీమ జిల్లా: అమలాపురం నియోజకవర్గం అల్లవరం మండలంలో వరద ముంపునకు గురైన ఓడలరేవు, రెబ్బనపల్లి, గోపాయిలంక, బుడంపేట, బోడసకుర్రు గ్రామాల్లో మంగళవారం జనసేన అమలాపురం నియోజకవర్గ ఇంచార్జ్ శెట్టిబత్తుల రాజబాబు పర్యటించి.. వరద బాధితులను పరామర్శించారు. బోడసకుర్రులో పడవలపై పర్యటించి నీట మునిగిన ఇళ్లను పరిశీలించడం జరిగింది. సుమారు వరద ముంపునకు గురై 4 రోజులు కావస్తున్నా ప్రభుత్వం ఏవిధమైన సహాయ కార్యక్రమాలు చేయట్లేదని బాధితులు తెలిపారు. ప్రభుత్వం తక్షణమే బాధితులను ఆదుకుని వారికి మౌలిక వసతులు కల్పించాలని శెట్టిబత్తుల రాజబాబు అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర, జిల్లా నాయకులు, ఎంపీటీసీలు, సర్పంచ్ లు, జనసేన పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.