అగ్నిప్రమాద బాదితులకు అండగా నిలిచిన జనసేన వీరమహిళలు

కేశవదాసుపాలెం గ్రామం, కూనపాలెంలో 5 రోజులు క్రితం రాత్రి 10 గంటల సమయంలో పెరబత్తుల సుబ్బలక్ష్మి, సత్తిబాబుల ఇంట గ్యాస్ పొయ్యి ద్వారా ఒక్కసారిగా అధిక మంట రావడంతో ఇల్లు అగ్నికి ఆహుతి అయి ప్రాణాలు చేత పట్టుకుని కట్టు బట్టలతో బయట పడ్డారు. ఆదివారం రాజోలు నియోజకవర్గ జనసేన వీరమహిళలు బాధితులకు అవసరం అయిన దుస్తులు, నిత్యావసర సరుకులు అందజేశారు ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మేడిది సరోజ భరత్, ఎంపీటీసీ ఉండపల్లి సాయికుమారి అంజి, వార్డ్ మెంబర్ కడలి మంగాదేవి రామచంద్రరావు, మలికిపురం ఎంపీటీసీ జక్కంపూడి శ్రీదేవి శ్రీనివాస్, రాజోలు ఎంపీటీసీ దార్ల లక్ష్మీ కుమారి లక్ష్మీ చిన్న బాబు, జడ్పిటిసి అభ్యర్థి తాడి లలితా మోహన్, రావి అంజనాదేవి, తాడి విజయా అడబాల సత్యమణి, అడబాల నాగలక్ష్మీ, పవర్ గర్ల్స్ , లక్ష్మీ, వీర మహిళలు జనసైనికులు జీల్లెళ్ళ నరసింహా రావు, బల్ల శ్రీను, ఏరుబండి చిన్ని, పోలిశెట్టి గణేష్, పాల్గొన్నారు వీరికి సహకరించిన ప్రతి ఒక్కరికి జనసేన తరఫున ప్రత్యేక ధన్యావాదాలు తెలియజేసారు.