మున్సిపల్ కార్మికులకు జనసేన మద్దతు..

*మాట తప్పిన వైసీపీ ప్రభుత్వం…

మున్సిపల్ కార్మికుల సమస్యలు పూర్తిస్థాయిలో పరిష్కారం అయ్యేంతవరకు జనసేన పార్టీ వారికి అండగా నిలుస్తుందని జనసేన పార్టీ ఉమ్మడి నెల్లూరు జిల్లా ఉపాధ్యక్షులు తీగల చంద్రశేఖర్ తెలిపారు. గూడూరు పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం ఎదుట మున్సిపల్ కార్మికులు తమ న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని చేపట్టిన ధర్నా కార్యక్రమానికి మంగళవారం జనసేన పార్టీ తరపున మద్దతు తెలుపుతూ వారికి సంఘీభావం తెలియజేశారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ మున్సిపల్ శాఖలో పనిచేస్తున్న కార్మికులను పర్మినెంట్ చేయాలని మరియు సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలన్నారు. కాంట్రాక్టు కార్మికులను పర్మినెంట్ చేస్తామని అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం నేడు వారిని మోసం చేయడం దారుణమన్నారు. పారిశుధ్య కార్మికులను పర్మినెంట్ చేయడంతో పాటు.. పాత బకాయిలను చెల్లించి, హెల్త్ అలవెన్స్లు కొనసాగించాలని.. పనిముట్లు, పరికరాలు ఇవ్వాలని డిమాండ్ చేసారు. మంత్రులు మారితే కార్మికుల జీతాలు తగ్గడం వైసీపీ ప్రభుత్వ హయంలో చూస్తున్నామన్నారు. ఆదివారం భీమవరం లో జరగనున్న జనసేన జనవాణి కార్యక్రమంలో పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ దృష్టికి కార్మికుల సమస్యలను తీసుకువెళ్లి ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి పరిష్కారం అయ్యే విధంగా ప్రయత్నిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జనసేన ఐటీ విభాగం నియోజకవర్గ అధ్యక్షులు స్వరూప్, నాయకులు పారిచర్ల భాస్కర్, రాజా, ఇంద్రవర్ధన్, కుమార్, శ్రీనాథ్, సంతోష్, రాజేష్, శివ, సూర్య, సనత్ , అవినాష్, సాయి, శంకర్, మోహన్, మహేష్ తదితరులు పాల్గొన్నారు.