ఆర్ఆర్ పేట వాసుల పోరాటానికి జనసేన అండగా నిలబడుతుంది

• సీఎం జగన్ గారిచ్చిన లిఖితపూర్వ హామీని నిలబెట్టుకోవాలి.
• బాధితులకు అండగా నిలబడకుండా అహంకారంతో దీక్షకు సంఘీభావం తెలపకుండా వెళ్లిపోయిన వెల్లంపల్లి శ్రీనివాస్ ను ఏమనాలి ?

విజయవాడ, పాత రాజరాజేశ్వరి పేటలో సుమారు 2000 కుటుంబాలకు రైల్వే అధికారులు గత మూడు నెలలుగా నోటీసులు జారీ చేస్తూ మూడు రోజుల కింద ముందుగా షాపులు ఖాళీ చేయాలని తదుపరి ఇల్లు ఖాళీ చేయిస్తామని దండోరా వేయిస్తున్న స్థానిక ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ ఇంతవరకు స్పందించకపోవడం దారుణమని బాధితులకు అండగా నిలబడకపోవడం దుర్మార్గమని 2021 విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో సీఎం జగన్మోహన్ రెడ్డి లిఖితపూర్వకంగా పాత ఆర్ఆర్ పేట వాసులకు ఇళ్ల పట్టాలు మంజూరు చేసి రిజిస్ట్రేషన్ చేస్తామని రైల్వే వారికి విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 25 ఎకరాల భూమిని అజిత్ సింగ్ నగర్లో కేటాయిస్తామని చెప్పి ఓట్లు వేయించుకుని నేడు పాత ఆర్ఆర్ పేటలో రైల్వే అధికారులు నోటీసులు ఇచ్చి కేవలం నాలుగు రోజుల్లో ఖాళీ చేయాలని ఒత్తిడి చేస్తున్న అధికార పార్టీ కి చెందిన స్థానిక కార్పొరేటర్ గాని స్థానిక ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు గానీ కనీసం స్పందించకపోవడం దారుణమన్నారు. సోమవారం ఉదయం తొమ్మిది గంటలకు జనసేన పార్టీ పశ్చిమ నియోజకవర్గ ఇన్చార్జ్ రాష్ట్ర అధికార ప్రతినిధి విజయవాడ నగర అధ్యక్షులు పోతిన వెంకట మహేష్, స్థానిక అధ్యక్షులు పిల్లా వంశీ కలిసి ఉర్దూ స్కూల్ మహంకాళి రోడ్ తదితర ప్రాంతాలను సందర్శించి స్థానిక ప్రజలు రైల్వే పోలీస్ ఇచ్చే నోటీసులతో దండోరాలతో పడే ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. స్థానిక మహిళలు మహేష్ తో గత 40 సంవత్సరాల నుంచి ఇక్కడే నివాసం ఉంటున్నామని పన్నులు కరెంట్ బిల్లులు చెత్త పన్ను చెల్లిస్తున్నామని ఇక్కడ ఆస్తులుగా మార్చుకొన్న ఇళ్ల స్థలాల్లో ఇల్లు కట్టుకొని అభివృద్ధి చేశామని ప్రతిసారి రైల్వే అధికారులు ఏదో రకంగా నోటీసులు జారీ చేస్తూ మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నారని, కార్పొరేషన్ ఎన్నికల్లో ముఖ్యమంత్రి ఇచ్చిన లేఖను చూసే వైఎస్ఆర్సిపికు ఓటు వేశామని, కానీ ఇంతవరకు మాకు పట్టాలు మంజూరు చేసి రిజిస్ట్రేషన్ చేయించడంలో ముఖ్యమంత్రి మాట నిలబెట్టుకోలేకపోయారని వాలంటీర్లు కూడా వచ్చి మీకు పట్టాల మంజూరులో మీరు అర్హులు జాబితాలో ఉన్నారని, మెసేజ్లు కూడా పెట్టారని నేడు రైల్వే అధికారులు వచ్చి నోటీసులు జారీ చేస్తూ దండోరాలు వేయిస్తుంటే స్థానిక కార్పొరేటర్ గాని ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ గాని వాలంటీర్లు గాని కనీసం స్పందించలేదని వారి జాడే కనబడడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఆకస్మికంగా అర్ధరాత్రి పూట వచ్చి ఇల్లు తొలగిస్తే ఆత్మహత్య శరణ్యమని ఆవేదనను వారు తెలియజేశారు. తదుపరి 10:30 కు పాత ఆర్ఆర్ పేట ఇళ్ల పట్టాల బాధ్యత సంఘం బత్తుల పాండు, జాఫర్ సాదిక్, ఖుర్షిడా, అజీజ్ ల అద్వర్యంలో నిర్వహించిన నిరసన దీక్షలో మహేష్ జనసేన పార్టీ నాయకులతో కలిసి పాల్గొని సంఘీభావం తెలిపడం జరిగింది. ఈ సందర్భంగా మహేష్ మాట్లాడుతూ సీఎం జగన్ తక్షణమే స్పందించి పాత ఆర్ఆర్ పేట వాసులకు న్యాయం చేయాలని లేని పక్షంలో పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని, విఎంసి ఎన్నికలలో జగన్ లిఖితపూర్వకంగా హామీ ఇచ్చారు. నేడు ఏమైందని? సిఎం బాధ్యత తీసుకోరా?అనిస్థానిక ఎమ్మెల్యే, స్థానిక కార్పొరేటర్ లు బాధ్యతారాహిత్యంగా ప్రవర్తిస్తున్నారని, ఇదేనా మీరు ఆర్ఆర్ పేట ప్రజలకు చేసే న్యాయమని, దీక్షకు సంఘీభావం తెలపకుండా అహంకారంతో ఆర్ఆర్ పేట వచ్చి వాళ్ళ పార్టీ 10 మందితో మాట్లాడి వెళ్లిపోయిన స్థానిక ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ ను ఏమనాలని, ఆర్ఆర్ పేట వాసులకు న్యాయం చేయడం అంటే ఇదేనా? అని, ఆర్ఆర్ పేట వాసుల పోరాటానికి జనసేన పార్టీ అండగా నిలబడుతుందని, ఈ సమస్య పరిష్కారం కోసం హైకోర్టులో కేసు వేయడానికి అన్ని రకాలుగా సహకరిస్తామని మహేష్ హామీ ఇచ్చారు అదేవిధంగా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ దృష్టిలో పెట్టి కేంద్ర పెద్దలతో మాట్లాడి ఈ ప్రాంత వాసుల ఇళ్ల పట్టాల సమస్యపై శాశ్వత పరిష్కారం కోసం కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ 56 డివిజన్ అధ్యక్షులు పిల్లా వంశీ నాయకులు అశోక్, షాహీనా, తమ్మారావు, బుట్ట సాయి, పొట్నూరు శ్రీనివాసరావు, బావిశెట్టి శ్రీనివాస్, సోమి మహేష్ తదితరులు పాల్గొన్నారు.