ఇచ్చాపురంలో ఘనంగా జనసేనాణి జన్మదిన వేడుకలు

ఇచ్ఛాపురం నియోజకవర్గం లొద్దపుట్టుగలో అంగ రంగ వైభవంగా స్వతంత్ర సమరయోధుడు భగత్ సింగ్ విగ్రహ ఆవిష్కరణ మరియు జనసేన జెండా ఆవిష్కరణ జరిగింది. జనసేన అధినేత కొణిదెల పవన్ కళ్యాణ్ 51వ జన్మదినం సందర్భంగా ముందుగా ఇచ్ఛాపురం స్వేచ్చావతి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి అక్కడి నుండి ఇచ్ఛాపురం, కంచిలి, సోంపేట, కవిటి మండలాల జనసైనికులు, వీర మహిళలతో భారీ ర్యాలీగా బయలుదేరి లొద్దపుట్టుగ గ్రామంలో దేశ నాయకుల స్ఫూర్తినీ వారి ఆదర్శాలను ముందుకు తీసుకువెళ్లాలి అనే ఉద్దేశ్యంతో తిప్పన సురేష్ రెడ్డి మరియు గ్రామ జనసైనికులు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్వతంత్ర సమరయోధుడు భగత్ సింగ్ విగ్రహ ఆవిష్కరణ మరియు రాష్ట్రంలో రెండువ పెద్ద జనసేన స్థూపం జెండా ఆవిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన ఇచ్ఛాపురం జనసేన ఇంఛార్జి దాసరి రాజు, జనసేన రాష్ట్ర జాయింట్ సెక్రటరీలు తిప్పన దుర్యోధన్ రెడ్డి, బైపల్లి ఈశ్వర్ రావు, రాష్ట్ర మత్స్యకార వికాస విభాగ కార్యదర్శి నాగుల హరి బెహరా ల చేతుల మీదుగా పండగ వాతావరణంలో అంగ రంగ వైభవముగా జరిగింది. పవన్ కళ్యాణ్ జన్మదినంను పురస్కరించుకొని అక్కడ మెడికల్ క్యాంపు, రక్తదాన శిబిరాలు నిర్వహించారు. ఇంతటి గొప్ప కార్యక్రమం విజయవంతంగా చేపట్టిన నిర్వాహకులకు లొద్దపుట్టుగ గ్రామ జన సైనికులు దాసరి రాజు అభినందించి దన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమాల్లో నియోజకవర్గ జనసేన నాయకులు, ఇచ్ఛాపురం మున్సపాలిటీ వార్డు ఇంఛార్జి లు జనసేన జెడ్పీటీసీ, సర్పంచ్, ఎంపీటీసీ అభ్యర్థులు, వార్డు మెంబర్లు వీర మహిళలు, జనసైనికులు పెద్ద ఎత్తులో పాల్గొన్నారు.