పరీక్ష లేకుండానే NTPC లో ఉద్యోగ అవకాశాలు..

NTPC Recruitment 2021: ప్రముఖ ప్రభుత్వ రంగ సంస్థ నేషనల్‌ థర్మల్‌ పవర్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (NTPC) తాజాగా మహిళల కోసం ప్రత్యేకంగా ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ నోటిపికేషన్‌ ద్వారా 50 ఇంజినీరింగ్‌ ఎగ్జిక్యూటివ్‌ ట్రైనీ ఉద్యోగాల భర్తీ చేపట్టనున్నారు.

ముఖ్యమైన విషయాలు..

మెకానికల్‌ (14), ఎలక్ట్రికల్‌ (22), ఎలక్ట్రానిక్స్‌ ఇన్‌స్ట్రుమెంటేషన్ (14) విభాగంలో ఈ ఖాళీలు ఉన్నాయి.

దరఖాస్తుల ప్రక్రియ ఏప్రిల్‌ 16న ప్రారంభమైంది. చివరి తేదీగా మే 6ను నిర్ణయించారు.

అభ్యర్థులను గేట్‌ 2021 స్కోర్‌ ఆధారంగా ఎంపిక చేసుకుంటారు.

అభ్యర్థులు ఇంజనీరింగ్ డిగ్రీలో తప్పనిసరిగా 65 శాతం మార్కులు సాధించి ఉండాలి.

ఫైనల్ ఇయర్, సెమిస్టర్ లో ఉన్న వారు కూడా ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు.

అర్హత కలిగిన మహిళా అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

గేట్‌ స్కోర్‌ ఆధారంగా షార్ట్‌ లిస్ట్‌ చేసిన అభ్యర్థులను డ్యాక్యుమెంట్‌ వెరికేషన్‌ చేపట్టి.. ఎంపిక చేసుకుంటారు.

మరిన్ని వివరాలకు అధికారిక వెబ్‌సైట్‌ ntpccareers.net ను చూడండి..