ఉదయగిరి వైసీపీ నుంచి జనసేనకు చేరికలు

జిల్లా అధ్యక్షులు చెన్నారెడ్డి మనుక్రాంత్ ఆధ్వర్యంలో ఉదయగిరి నియోజకవర్గం నాయకులు ఆల్లూరి రవీంద్ర నాయకత్వంలో గత ఆరు సంవత్సరాలుగా వైసీపీలో ముఖ్య నాయకులు మరియు కార్యకర్తలు జనసేన పార్టీ కార్యాలయంలో జనసేన పార్టీలోకి చేరారు. జిల్లా ప్రధాన కార్యదర్శి గునుకుల కిషోర్ వారికి పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. జిల్లా అధ్యక్షులు సూచనలతో పార్టీలో వారికి గౌరవ స్థానాన్ని కల్పిస్తామని, ఉదయగిరి నియోజకవర్గ జనసేన పార్టీ బలోపేతానికి తోడ్పడాలని వారు సూచించారు. ఈ సందర్బంగా ప్రధాన కార్యదర్శి గునుకుల కిషోర్ మాట్లాడుతూ

*ఉద్యోగస్తుల సరైన వేతనాలుకల్పించటం దగ్గర నుంచి కార్యకర్తలకు గౌరవ స్థానం ఇవ్వటం వరకు పనిచేసే వారిని పూర్తిగా విస్మరించింది ఈ వైసీపీ ప్రభుత్వం…

  • గ్రామస్థాయి నుంచి ప్రజల నమ్మకాన్ని వైసీపీ ప్రభుత్వం కోల్పోతుందని తెలిపేందుకు నిదర్శనం ఈరోజు మిత్రులకు పార్టీలో చేరడం
  • ముఖ్యంగా ఉదయగిరి నియోజకవర్గంలో ఎన్నికల అప్పుడు తప్పితే ఎమ్మెల్యే గారు ఎప్పుడు సామాన్య ప్రజలకు కనపడని పరిస్థితి
  • ఎన్నో హంగులు ఆర్భాటాల తో అట్టహసంగా ప్రజాధనంతో నిర్మితమైన ఉదయగిరి ప్రభుత్వ ఆసుపత్రి అత్యవసర పరిస్థితుల్లో సామాన్య ప్రజలకు అందుబాటులో లేని దుస్థితి.
  • నియోజకవర్గం పూర్తిగా వెనుక పడిపోవడానికి కుటుంబ రాజకీయాలే కారణం.
  • గతంలో ఎంపీటీసీ ఎలక్షన్ లప్పుడు దౌర్జన్యానికి దిగిన మండలం నుంచి వైసీపీ కార్యకర్తలు పార్టీలో చేరడం సంతోషదాయకం అన్నారు.
  • ఈ ప్రభుత్వంలో కొన్ని కుటుంబాలు తప్పిస్తే సామాన్య ప్రజలు అభివృద్ధి శూన్యం.
  • ఉచిత పథకాల పేరుతో ప్రభుత్వం విద్యార్థులకు ఇప్పటికే మోసం చేసింది ఉత్తీర్ణులై వేరే ఉద్యోగాలు,ఉన్నత విద్యలకు వెళ్లేవారికి స్థానిక కళాశాలలో ఫీజు రియంబర్స్మెంట్ రాని కారణంగా ఫీజు కడితే తప్ప వారికి సర్టిఫికెట్లుటీ ఇవ్వలేని పరిస్థితి నెలకొంది..
  • పథకాల పేరుతో మాయ చేయడం తప్పితే అభివృద్ధి శూన్యం.
  • మూడు సంవత్సరాలు పూర్తి అవుతున్న రాష్ట్ర రాజధాని చెప్పలేని దుస్థితి
  • అన్ని వర్గాలలో ఏర్పడిన అసంతృప్తి పూర్తిగా వైసిపి పార్టీని పతనం చేస్తుందని అన్నారు.
    ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు కిషోర్ గునుకుల, సుధీర్ బద్దిపూడి, ఉదయగిరి నియోజకవర్గం నాయకులు అల్లూరి రవీంద్ర, నాయకులు సురేందర్ రెడ్డి, కిరణ్ కుమార్, తిరుపతయ్య, సురేష్, రామయ్య తదితరులు పాల్గొన్నారు.