శెట్టిబలిజలకు జూపూడి బేషరతుగా క్షమాపణల చెప్పాలి: పితాని

కోనసీమ జిల్లా, ముమ్మిడివరం బీసీ శెట్టిబలిజ కులస్తులపై జూపూడి ప్రభాకరావు అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ ముమ్మిడివరం స్థానిక జనసేన పార్టీ కార్యలయంలో రాష్ట్ర జనసేన పార్టీ పిఏసి సభ్యులు, నియోజకవర్గ ఇంచార్జి పితాని బాళకృష్ణ పత్రికా సమావేశం నిర్వహించారు. జూపూడి ప్రభాకరావు ఉన్నతమైన స్థానంలో ఉండి కులాల మధ్య చిచ్చు పెట్టాలా బీసీ శెట్టిబలజలను కించపరుస్తూ మాట్లాడం చాలా బాధాకరం. రాజకీయ లబ్ది కోసం ఇటువంటి వఖ్యలు మానుకోవాలి. డాక్టర్ బాబసాహెబ్ అంబేద్కర్ దేశప్రజల ఆరాధ్య దైవం. మీరు శెట్టిబలిజ కులస్తుల పై చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలి. శెట్టిబలిజలకు బెషరతుగా క్షమాపణలు చెప్పాలి. కోనసీమలో కుల మతాలకు అతీతంగా అందరు అన్నదమ్ములా ఒకే కుటుంబంగా కలసి ఉంటారు. మీరు ఎక్కడో ఉండి ఇటువంటి వ్యాఖ్యల్లు చెయ్యడం వెనుక అర్ధం ఏమిటి. కోనసీమలో ఉన్న శెట్టిబలిజలు మత్తు మందుల బానిసలు, దరిద్రులు కాదు, ఆత్మభిమానం గౌరవంతో అన్నదముల భావంతో ఉండేవారు. సాక్షాత్తు రాష్ట్ర మంత్రివర్యులు పినిపే విశ్వరూప్ అయన మాటల్లోనే ఈ విధ్వంసనికి కొంతమంది వైసీపీ కౌన్సలర్లు నాయకులు ఉన్నారు అని అన్నారు. ప్రశాంతంగా ఉండే కోనసీమను మీ స్వార్ధ రాజకీయాలకు బలిచేయ్యొద్దు. వైసీపీ పార్టీలో ఉన్న బీసీ శెట్టిబలిజ నాయకులు రాష్ట్ర మంత్రి చెల్లుబోయిన వేణు, రాజ్యసభ సభ్యులు పిల్లి బోస్, కనీసం జూపూడి వాఖ్యలను ఖండించకపోవడం చాలా సిగ్గుసేటు. మీరు ముఖ్యమంత్రికి బయపడి కులాన్ని అవమానించి మాట్లాడిన వారి మాటలను ఖండించకపోవడం బాధాకరం. గౌరవ జూపూడి ప్రభాకరావు గారు యావత్ కోనసీమ శెట్టిబలిజ కులస్తులకు బేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండు చేస్తున్నామని పితాని బాలకృష్ణ అన్నారు.