జనసంద్రాన్ని తలపించిన కానవరం

రాజానగరం నియోజకవర్గం, ఆదివారం కానవరం గ్రామంలో జనసేన పార్టీ నాయకులు బత్తుల బలరామకృష్ణ జనంకోసం జనసేన మహా పాదయాత్ర విజయవంతంగా నిర్వహించారు. జనసేన పార్టీ నాయకులు బత్తుల బలరామకృష్ణతో పాటు వారి అల్లుడు తోట తోట పవన్ కుమార్ కూడా ఈ మహాపాదయాత్రలో పాల్గొన్నారు. వీరితో కలసి జనసైన్యం సాగించిన ఈ మహాపాదయాత్రకు కానవరంలో అపూర్వ స్వాగతం లభించింది. 500 మోటారు బైకులు, 100 కార్లతో ర్యాలీగా పరిజల్లిపేట నుండి కానవరం వరకూ భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం బత్తుల బలరామకృష్ణతో పాటు జనసేన శ్రేణులు పాదయాత్రగా కానవరంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆశయాలు, పార్టీ సిద్దాంతాలను ప్రజలకు వివరిస్తూ ఇంటింటికీ కరపత్రాలు అందజేశారు. పాదయాత్రలో భాగంగా బత్తుల బలరామకృష్ణకు ఇంటింటా మహిళలు హారతులు పట్టారు. అడుగడుగునా ప్రజలు పూలవర్షం కురిపించారు. పాదయాత్రలో భాగంగా బత్తుల బలరామకృష్ణ మాట్లాడుతూ రాష్ట్రంలో మార్పు ప్రారంభమైందన్నారు. రాజానగరం నియోజకవర్గంలో అయితే 50 వేల మెజార్టీకి తగ్గకుండా జనసేన విజయం సాధించడం ఖాయం అన్నారు. వైసిపి అరాచక పాలనపై ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారన్నారు. ఈసారి జనసేనను అధికారంలోకి రావడానికి జనం సిద్ధంగా ఉన్నారన్నారు. రైతుల పక్షం అని డబ్బాకొట్టుకునే ఈ ప్రభుత్వం తుఫాన్ వల్ల నష్టపోయిన జీడిమామిడి, మామిడి, మొక్కజొన్న రైతుల్ని గాలికొదిలేసిందని బత్తుల విమర్శించారు. రాజానగరం రైతుల కష్టాలు పోవాలంటే జనసేన రావాలని ఇక్కడి ప్రజలు కోరుకుంటున్నారన్నారు. నేనూ రైతు బిడ్డనేనని, రైతుల కష్టాలు తనకు తెలుసునన్నారు. ఏ ఊరు వెళ్లినా బత్తుల వెంట వాళ్ళ కుటుంబ సభ్యులే కూడా ఉంటున్నారని వైసిపి నేతలు చేస్తున్న విమర్శలపై బత్తుల ఫైర్ అయ్యారు. నేను ఇక్కడి వాడినే, ఈ నియోజకవర్గంలో ప్రతి గ్రామంలోనూ నాకు బందువులున్నారన్నారు. మీరు ఇక్కడివాళ్ళు కాదు కాబట్టి మీకు ఇక్కడ బందులెవ్వరూ లేరంటూ ఎమ్మెల్యే జక్కంపూడి రాజాకు బత్తుల చురకలు వేశారు. రాబోయే ఎన్నికల్లో ఇక్కడ జనసేన విజయం ఖాయమన్నారు. మీరు ఇంటికి వెళ్లడం ఖాయమన్నారు. పెట్టే బేడా సర్దుకోవాల్సిన సమయం వచ్చేసిందన్నారు. ఇక్కడ ఏభై వేలకు పైనే మెజార్టీతో జనసేన గెలుస్తుందని బత్తుల ధీమా వెల్లడించారు. ఈ కార్యక్రమంలో పరిజల్లిపేట, కానవరం గ్రామం నుండి అలాగే రాజానగరం నియోజకవర్గంలో ప్రతీ గ్రామం నుండి జనసేన పార్టీ సీనియర్ నాయకులు, జనసైనికులు, వీరమహిళలు భారీగా పాల్గొన్నారు.