కోర్టు వాయిదాకు హాజరైన కందుల దుర్గేష్

కాకినాడ: 2020 జనవరి 12వ తేదీన కాకినాడలో జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పై ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలపై నిరసన తెలుపుతున్న జనసేన శ్రేణులపై వైసీపీ నాయకులు, కార్యకర్తలు దాడి చేసి అక్రమంగా కేసులు బనాయించిన సంగతి అందరికీ విదితమే. ఆ రోజు బనాయించిన కేసుల నిమిత్తం శుక్రవారం కాకినాడ జిల్లా కోర్టులో వాయిదాకి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు కందుల దుర్గేష్ హాజరయ్యారు.. వారివెంట పిఠాపురం ఇన్చార్జ్ శ్రీమతి మాకినీడి శేషుకుమారి, భీమిలి ఇంచార్జ్ పంచకర్ల సందీప్, రాష్ట్ర కార్యదర్శి గంట స్వరూప, కాకినాడ సిటీ అధ్యక్షులు సంగిశెట్టి అశోక్, కార్యదర్శి తాటికాయల వీరబాబు, జిల్లా ప్రధాన కార్యదర్శి తలాటం సత్య, జిల్లా ఉపాధ్యక్షులు సుంకర కృష్ణవేణి, కర్రెడ్ల గోవింద్,నున్న గణేష్, పి ఆర్ పి శ్రీనివాస్, మర్రి దొరబాబు, సయ్యద్ ఫాజిల్, పెంకే జగదీష్, జనసేన నాయకులు, జనసైనికులు వీరమహిళలు కోర్టులో హాజరవ్వడం జరిగింది.