దేవీ నవరాత్రి ఉత్సవాలలో అమ్మవారిని దర్శించుకున్న కందుల

రాజమండ్రి రూరల్, కాతేరు గ్రామం మల్లయ్య పేటలో జనసేన పార్టీ కార్యకర్తలు నిర్వహిస్తున్న దేవి నవరాత్రి ఉత్సవాలలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు కందుల దుర్గేష్, రూరల్ మండల అధ్యక్షులు సి.హెచ్. చిన్నారావు అమ్మవారిని దర్శించుకొని పూజలు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాజమండ్రి రూరల్ మండల ప్రధాన కార్యదర్శి ఎం.శ్రీనివాస్, కార్యదర్శి జి.రాజేశ్వరి, ఆర్.మణికంఠ, చందు, టి.మణికంఠ, కె.ప్రసాద్, గాయత్రి, తేజ, సాయి, విజయలక్ష్మి, గాంధీ, తిరుపతి, శేఖర్, భవాని భక్తులు, ఉత్సవ కమిటీ సభ్యులు, పార్టీ జనసైనికులు, వీరమహిళలు పాల్గొన్నారు.