రాజంపేటను అన్నమయ్య జిల్లాగా సాధించుకుంటాం: ఆకుల నరసయ్య

రాజంపేటను, ఎన్నికల మ్యానిఫెస్టో ప్రకారం ఇచ్చిన మాట తప్పి పార్లమెంట్ నియోజకవర్గం అయిన రాజంపేటను అన్నమయ్య జిల్లాగా ప్రకటించకుండా రాయచోటిని అన్నమయ్య జిల్లాగా ప్రకటించడంతో గత నెల 26 వ తేదీ రాజంపేట ప్రజలు పోరాటం చేస్తూ మంగళవారం బంద్ కి పిలుపునిచ్చారు. వ్యాపారస్తులు అన్ని పార్టీల కార్యకర్తలు అన్ని రంగాల కార్మికులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా రాజంపేట జనసేన యువనాయకుడు ఆకుల నరసయ్య మాట్లాడుతూ తన తండ్రి పాలనలో ఇక్కడ తాళ్లపాక అన్నమయ్య 108 అడుగుల విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ రోజు అయన కుమారుడైన సీఎం అన్నమ్మయ్యను విస్మరించడం చాలా ఘోర తప్పిదం అన్నారు. అలాగే ఎన్నికల ముందు కడప పౌరుషానికి ఢిల్లీ సోనియాకు పోటీ అని చెప్పి అత్యధిక మెజారిటీతో గెలిపించిన ప్రజలకు ఇప్పుడు సీఎం అయ్యాక సొంత జిల్లాలోనే ఇచ్చిన మాట తప్పడం దేనికి సాంకేతమని జనసేన పార్టీ తరపున ప్రశ్నించారు. అలాగే ఎమ్మెల్యే, ఎంపి తమ దగ్గర ఉన్న కోట్ల డబ్బుతో ఇటు అసెంబ్లీ అటు పార్లమెంట్ లో వీళ్ళు అడుగు పెట్టే అర్హత సాధించలేదని మా పేద ప్రజలు ఓట్లు వేస్తేనే మిమ్మల్ని ప్రజా ప్రతినిధులుగా అడుగు పెట్టనిచ్చారని ఆకుల నరసయ్య గుర్తు చేశారు. చివరిగా మా పోరాటం చూసి కూడా ప్రభుత్వం నిర్ణయం మార్చుకోకుండా మాకు అన్యాయం చేస్తే ఖచ్చితంగా 2024 జనసేన పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే కేంద్రంతో మాట్లాడి కోట్లమంది ఆరాధించే తిరుపతి వెంకన్న భక్తుడైన అన్నమయ్య పేరు మీద ప్రత్యేక జిల్లాగా ప్రకటించే విధంగా మా జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ కి పూర్తి చరిత్ర ఆధారాలు, ఇక్కడ ఉన్న అన్ని రకాల సౌకర్యాలు ఉన్న పూర్తి వివరాలు మా అధ్యక్షుని ముందు ఉంచి రాజంపేటను అన్నమయ్య జిల్లాగా సాధించుకుంటామని తెలియచేశారు. ఈ బంద్ లో జనసేన లీగల్ సెల్ నాయకలు అడ్వకేట్ కరుణాకర్ రాజు, కత్తి సుబ్బారాయుడు, రాటాల రామయ్య, బాలసాయి, గోపీ, శంకర్ పాల్గొన్నారు.