దివ్యాంగుడైన నాగరాజుకు అండగా నిలబడదాం.. డాక్టర్. యుగంధర్

గంగాధర్ నెల్లూరు నియోజకవర్గం, వెదురుకుప్పం మండలం, మొండి వెంగనపల్లి పంచాయితీ, నెమలిగుంట గ్రామ నివాసి దివ్యాంగుడైన నాగరాజు కుటుంబానికి ఇళ్ల నిర్మాణం చేయుటకు శుక్రవారం మెజర్మెంట్ ఇవ్వటం జరిగింది, ఈ కార్యక్రమానికి ప్రధాన దాతలు గుణశేఖర్ కు జనసేన పార్టీ, గంగాధర్ నెల్లూరు నియోజకవర్గం తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసారు, ఈ సందర్భంగా డా. యుగంధర్ పొన్న మాట్లాడుతూ దాతలారా ముందుకు రండి, దివ్యాంగుడైన నాగరాజుకు అండగా నిలబడదాం, చక్కటి ఇంటి నిర్మాణం చేసి గృహప్రవేశం చేద్దాం, రండి చేయూతనివ్వండి, దాతలు దైవ స్వరూపులు దివ్యాంగులకు అండగా నిలబడండని యుగంధర్ పొన్న పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు పురుషోత్తం, ఉపాధ్యక్షులు సతీష్, సీనియర్ నాయకులు యతీశ్వర్ రెడ్డి, అజయ్, జిల్లా సంయుక్త కార్యదర్శి రాఘవ, జనసైనికులు పాల్గొన్నారు.