పిఏసి సభ్యులు నాగబాబు చేతుల మీదుగా ‘మహారక్త దాన శిబిరం’ ప్రచార కరపత్రం విడుదల

హైదరాబాద్, మెగాబ్రదర్, జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటి సభ్యులు నాగబాబు చేతుల మీదుగా ‘మహారక్త దాన శిబిరం’ ప్రచార కరపత్రం విడుదల చేయడం జరిగింది. జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఈ నెల 29న రాజానగరం నియోజకవర్గం, గాదరాడ గ్రామంలో నాయకులు బత్తుల బలరామకృష్ణ శ్రీమతి వెంకటలక్ష్మి దంపతుల ఆధ్వర్యంలో జరిగే “మహా రక్తదాన శిబిరం” సంబంధించిన కరపత్రాన్ని హైదరాబాద్ జనసేన కేంద్ర కార్యాలయంలో, పిఏసి సభ్యులు, మెగా బ్రదర్ నాగబాబు ఆవిష్కరించి జనసేన పార్టీ తరఫున జరిగే, ఈ మంచి కార్యక్రమాన్ని అందరూ విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ ముఖ్య కార్యక్రమంలో ‘టీ టైం’ అధినేత, జనసేన నాయకులు తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాజానగరం జనసేన నాయకులు బత్తుల బలరామకృష్ణ మాట్లాడుతూ “మహా రక్తదాన శిబిరం” ను చాలా నిర్వహిస్తున్నామని, నియోజకవర్గ నలుమూలల నుండి అందరిని ఆహ్వానిస్తున్నామని, భారీ సంఖ్యలో జనసైనికులు పాల్గొని విజయవంతం చేయనున్నారని తెలిపారు. రాష్ట్రస్థాయి జనసేన నాయకులను, జిల్లాస్థాయి జనసేన నాయకులను, జిల్లాలో అన్ని నియోజకవర్గాల ఇంచార్జులను, వీరమహిళలను మరియు జనసైనికులను ఆహ్వానించడం జరిగింది.