మండపేట ద్వారపూడి రోడ్డు వెంటనే నిర్మించాలి

*జనసేన రిలే నిరాహార దీక్ష.
*జనసేన దీక్షలకు అన్ని రాజకీయ పార్టీలు మద్దతు.

మండపేట, ఇప్పనపాడు గ్రామంలో జనసేన పార్టీ అధ్వర్యంలో గత 3 రోజుల నుండి చేపట్టిన రిలే నిరాహార దీక్షలకు బుధవారం అన్ని రాజకీయ పార్టీల నాయకులు సంఘీభావాన్ని వ్యక్తం చేశారు. మండపేట బ్రిడ్జి నుండి ద్వారపూడి బ్రిడ్జి వరకు గల ఆర్ అండ్ బి రహదారి పూర్తిగా పాడైపోయిందని ఆ రోడ్డులో ఏర్పడిన గోతులు పూడ్చడానికి వేసిన కంకర, బూడిద వలన రోడ్డుకి చేర్చి ఉన్న ప్రజలందరి ఇళ్ళ నిండా దుమ్ముతో పెరికిపోయి వంటలు చేసుకోడానికి వీలులేకుండా ఉంటుందని ఆరోపించారు. ఈ రోడ్డులో వెంటనే బిటి రోడ్డు వేయాలని గత 3 రోజుల నుండి ఇప్పనపాడు గ్రామంలో జనసేన పార్టీ నియోజకవర్గ ఇంచార్జ్ వేగుళ్ళ లీలాకృష్ణ నాయకత్వంలో జనసేన మండల పార్టీ అధ్యక్షులు కుంచె ప్రసాద్ గారు చేస్తున్న నిరాహార దీక్షా శిబిరాన్ని బుధవారం ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరావు గారు సందర్శించి సంఘీభావాన్ని వ్యక్తం చేసారు. ఈ సందర్భంగా దీక్షా శిబిరంలో ఆయన మాట్లాడుతూ…
2018 డిసెంబర్ లోనే ఈ రోడ్డు నిమిత్తం ఆనాటి మఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయిడు హయాంలో రూ.10.00 కోట్లు మంజూరు అయ్యాయన్నారు. ఈ ప్రభుత్వం రాగానే దాన్ని రద్దు చేసారన్నారు. 2020 డిసెంబర్ నెలలో కేంద్ర ప్రభుత్వం రూ.25.00 కోట్లు ద్వారపూడి నుండి యానం వరకు ఇచ్చినప్పటికీ, ఈ రాష్ట్ర ప్రభుత్వం గుత్తేదారులు ఎవరికీ సొమ్ము చెల్లించకపోవడంతో గుత్తేదారులు ఎవరు టెండర్లు వేయడానికి ముందుకు రావడం లేదని దుయ్యబట్టారు. ఇది ముమ్మాటికి ఈ రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యమే తప్ప మరొకటిలేదని పేర్కొన్నారు. ఇకనైనా మండపేట నియోజకవర్గ వైస్సార్ సిపి ఇంచార్జిలు ముందుకు వచ్చి ద్వారపూడి నుండి యానం రోడ్డుతో పాటు, మండపేట నియోజకవర్గంలో పాడైపోయి ప్రజలు ఇబ్బంది పడుతున్న రహదారులను యుద్ద ప్రాతిపదికన పూర్తిచేయాలని కోరారు. అనంతరం ద్వారపూడి నుండి యానం రోడ్డును పరిశీలించారు. వీరితో పాటు ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు మార్రెడ్డి శ్రీనివాసరావు, బీజేపీ నాయకులు కోనా సత్యనారాయణ, అన్ని పార్టీల నాయకులు తదితరులు పాల్గొన్నారు.

జనసేన నిరాహార దీక్షకు సంఘీభావం తెలిపిన జనసేన యువ కెరటం వేగుళ్ళ రాజబాబు

ఇప్పనపాడు గ్రామంలో గత 3 రోజుల నుండి జనసేన పార్టీ నియోజకవర్గ ఇంచార్జ్ వేగుళ్ళ లీలాకృష్ణ గారు నాయకత్వంలో జనసేన మండల పార్టీ అధ్యక్షులు కుంచె ప్రసాద్ చేస్తున్న రిలే నిరాహార దీక్షా శిబిరాన్ని బుధవారం వేగుళ్ళ రాజబాబు సందర్శించి సంఘీభావాన్ని వ్యక్తం చేసారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండపేట బ్రిడ్జి నుండి ద్వారపూడి బ్రిడ్జి వరకు గల ఆర్ అండ్ బి రహదారి పూర్తిగా పాడైపోయిందని ఆ రోడ్డులో ఏర్పడిన గోతులు పూడ్చడానికి వేసిన కంకర, బూడిద వలన రోడ్డుకి చేర్చి ఉన్న ప్రజలందరి ఇళ్ళ నిండా దుమ్ముతో పెరికిపోయి వంటలు చేసుకోడానికి వీలులేకుండా ఉంటుందని ఆరోపించారు. తక్షణమే అధికారులు స్పందించి ద్వారపూడి నుండి యానం రోడ్డుతో పాటు, మండపేట నియోజకవర్గంలో పాడైపోయి ప్రజలు ఇబ్బంది పడుతున్న రహదారులను యుద్ద ప్రాతిపదికన పూర్తిచేయాలని కోరారు. అనంతరం ఈరోజు దీక్ష చేసిన వారికి నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింపచేసారు.