గుంటూరు జనసేనలో భారీ చేరికలు

గుంటూరు, నగర జనసేనపార్టీ ఆఫీసులో పార్టీ అధ్యక్షుడు నేరెళ్ళ సురేష్ సమక్షంలో 9, 10, 11, వార్డుల నుండి భారీగా బిసి, ఎస్సీ, మైనారిటీలకు చెందిన వైసిపి, టిడిపి కార్యకర్తలు సుమారు 300 మంది జనసేన పార్టీ సిద్ధాంతాలకు ఆకర్షితులై స్వచ్చందంగా జనసేనలో చేరడం జరిగింది. ఈ బహృత్తర కార్యక్రమాన్ని నగర జనసేనపార్టీ కార్యదర్శి నాగేంద్ర సింగ్ సమన్వయం చేసి వీరందరినీ పార్టీలోకి తీసుకురావడం జరిగింది. ఈ సందర్భంగా నేరెళ్ళ సురేష్ మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ ఆశయాలు నచ్చి ఇంతమంది పార్టీ లోకి రావడం చాలా ఆనందంగా ఉందని, అధికారంలో లేకపోయినా సరే ఆయన సొంత డబ్బులు ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతులకు లక్ష రూపాయలు ఇస్తూ వారి కుటుంబాలకు అండగా ఉంటున్నారని తెలిపారు. ముస్లిం సోదరులను ఓటుబ్యాంకు రాజకీయాలు చేస్తున్నారు తప్ప వారి అభ్యున్నతికి కృషి చేయడం లేదని, సామాజిక న్యాయం జరిగేలా మనమంతా కలిసి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ని ముఖ్యమంత్రిని చేస్తే భావితరాలకు బంగారుబాట వేస్తారని అన్నారు. జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి వడ్రాణం మార్కండేయ బాబు మాట్లాడుతూ… గత ఎన్నికల్లో వైసిపి ప్రభుత్వం ఒక్కచాన్స్ అని ప్రజలు అవకాశం ఇస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిస్థితిని అధ్వాన్నంగా తయారు చేసారని,. ఈరోజు ఇంతమంది ముస్లిం మైనార్టీలకు చెందిన మహిళలు కూడా చేరడం శుభపరిణామని, రాబోయే రోజుల్లో పవన్ కళ్యాణ్ ఆశయాలకు అనుగుణంగా పనిచేసుకుంటూ పార్టీ బలోపేతానికి కృషి చేయాలని కోరారు. రాష్ట్ర కార్యదర్శి నాయుబ్ కమాల్ మాట్లాడుతూ ముస్లిం సోదరులకు వైసిపి ప్రభుత్వం తీరని అన్యాయం చేశారని, ముస్లిం కుటుంబాలకు అధికారంలోకి రాగానే చేస్తామని చెప్పిన దుల్హాన్ పధకంలాంటివి ఏమి చేయలేదని, గుంటూరు తూర్పు నియోజకవర్గం ముస్లిం సోదరులకు కేటాయించినా, సరైన నిధులు విడుదల చేయకుండా అన్యాయం చేస్తున్నారని అలాగే గెలిచిన వారు ఎవరికివారు సొంత ప్రయోజనాల కోసం పనిచేస్తున్నారు తప్ప అభివృద్ధి చేయండం లేదని, ఇది మారాలంటే రాబోయే ఎన్నికల్లో జనసేన పార్టీని గెలిపించే దిశగా అడుగులు వేయాలని కోరారు. మహిళా నాయకురాలు శ్రీమతి పార్వతి నాయుడు మాట్లాడుతూ వైసిపి ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని, చిన్న పిల్లలపై అఘాయిత్యాలు రోజురోజుకి పెచ్చరిల్లిపోతున్నాయని, ఇలాంటి దుర్మార్గపు పాలన అంతమొందించి ప్రజలకు మేలు జరగాలంటే జనసేన పార్టీ అధికారంలోకి రావాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన లీగల్ సెల్ గోపి, లక్ష్మీశెట్టి నాని, పమిడి పవన్ మరియు గుంటూరు నగరజనసేన పార్టీ ఉపాధ్యక్షులు చింతా రేణుకా రాజు, కొండూరు కిషోర్, ప్రధాన కార్యదర్శులు యడ్ల నాగమల్లేశ్వరరావు, చామర్తి ఆనంద్ సాగర్, సూరిశెట్టి ఉపేంద్ర కార్యదర్శులు ఆయుబ్ ఖాన్ పఠాన్, కల్లగంటి త్రిపుర, బండారు రవీంద్ర కుమార్, ఆళ్ల కోటేశ్వరరావు, గాదె లక్ష్మణరావు, సంయుక్త కార్యదర్శులు పుల్లంశెట్టి ఉదయ్ కుమార్, పులిగడ్డ గోపి, బొందిలి నాగేంద్ర సింగ్, పుల్లాభట్ల ఫణి కుమార్, బందెల నవీన్ బాబు, కొత్తకోట ప్రసాద్, చలమలశెట్టి దుర్గాప్రసాద్ పాల్గొన్నారు.