లంకూరు గ్రామ పెద్దలతో మేడ గురుదత్ ప్రసాద్ మర్యదపూర్వక భేటీ

రాజానగరం: సీతానగరం మండలం, లంకూరు గ్రామంలో పెద్దలు మట్ట సుబ్రహ్మణ్యం, మట్ట సురేష్, మట్ట ఆదినారాయణ, మట్ట సత్తియ్యలను మర్యాదపూర్వంగా కలిసిన రాజానగరం నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ & ఐక్యరాజ్యసమితి అవార్డు గ్రహీత మేడ గురుదత్ ప్రసాద్. ఈ సమావేసంలో జనసేన పార్టీ భవిష్యత్తు కార్యాచరణ గురించి మరియు పార్టీని జనాల్లోకి ఏ విధంగా తీసుకెళ్లాలనే విషయంలో వారి యొక్క అనుభవాలు తెలియజేసారు. ఈ కార్యక్రమంలో సీతానగరం మండల జనసేన పార్టీ కో-కన్వీనర్ కాత సత్యనారాయణ, సీతానగరం మండల యూత్ పినిశెట్టి సాయి ప్రసాద్, చీడీపీ నాగేష్, చల్లా ప్రసాద్, వల్లేపల్లి రాజేష్, పెద్ద కాపు తదితరులు పాల్గొన్నారు.