మెగా రక్తదాన శిబిరం

కదిరి నియోజకవర్గం, అఖిల భారత చిరంజీవి యువత మరియు రాష్ట్ర చిరంజీవి యువత ఆద్వర్యంలో పద్మభూషణ్ డాక్టర్ మెగాస్టార్ చిరంజీవి, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకల్లో భాగంగా పట్టణంలోని ఏపి ఎన్.జి.ఓ హోమ్ నందు “మెగా రక్తదాన శిబిరం” ఏర్పాటు చెయ్యడం జరిగింది. ఈ కార్యక్రమానికి పట్టణ సర్కిల్ ఇన్స్పెక్టర్ తమ్మిశెట్టి మధు సుదన్, ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ సూపరిడెంట్ డా.హుస్సేన్ బ్లడ్ ఇన్చార్జి వహీదా, జనసేన పార్టీ ఇంచార్జీ భైరవ ప్రసాద్ విచ్చేసి మెగా ఫ్యామిలీ హీరోలు చేస్తున్న సేవా కార్యక్రమాల గురించి, మెగాస్టార్ చిరంజీవి రక్తం లేకుండా ఎవరూ చనిపోకూడడు అనే ఒక మంచి ఆలోచనతో చిరంజీవి బ్లడ్ బ్యాంక్ మరియు నేత్రదానంతో మరొకరికి చూపునిద్దామనే మంచి ఉద్దేశంతో ఐ బ్యాంక్ స్థాపించి ఈ మంచి కార్యక్రమాలలో అభిమానులను ప్రోత్సహించి సమాజ సేవకులుగా తీర్చి దిద్దారు అనడంలో అతిశయోక్తి కాదు. ఆయన సేవా స్ఫూర్తిని కొనసాగిస్తూ జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కూడా ఎంతో మందికి సహాయం చేసిన గొప్ప వ్యక్తులు అని, రాష్ట్రంలో కౌలురైతులు ఆత్మహత్య చేసుకుంటే ప్రతి కుటుంబానికి లక్ష రూపాయల ఆర్థిక సహాయం అందిస్తూ రాష్ట్రంలో వరదలు వచ్చినపుడు, విపత్తులు సంబంచినపుడు మేము ఉన్నాం అంటూ ముందుకు వచ్చే మెగా ఫ్యామిలీకి, వారిని స్ఫూర్తిగా తీసుకొని ఆయన పేరు మీద రక్తదానం, సేవా కార్యక్రమాలను చేస్తున్న అభిమానులను ప్రశంసించారు. రక్తదానం చేసిన రక్త దాతలకు కదిరి పట్టణ సర్కిల్ ఇన్స్పెక్టర్ మధుసూదన్, బ్లడ్ బ్యాంక్ ఇంచార్జీ వహీద, జనసేన పార్టీ ఇంచార్జీ భైరవ ప్రసాద్, సీనియర్ మెగా అభిమానులు జ్ఞాపికను, ప్రశంసా పత్రాలను అందించారు. జూనియర్ మెగా అభిమానులు 30 సంవత్సరాలుగా మెగాస్టార్ చిరంజీవిని స్ఫూర్తిగా తీసుకొని సేవా కార్యక్రమాలను చేస్తున్న సీనియర్ మెగా అభిమానులను అభిమానుల సమక్షంలో సత్కరించి రాబోయే రోజుల్లో సీనియర్ జూనియర్ అని తేడా లేకుండా చిరంజీవి కోసం ఆయన చేస్తున్న సేవా స్ఫూర్తిని ముందుకు తీసుకొని వెళదాం అని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో అఖిల భారత చిరంజీవి యువత కదిరి నియోజకవర్గం అధ్యక్షులు లక్ష్మణ కుటాల, మెగా సీనియర్ అభిమానులు అవుల శ్రీనివాసులు, ఇలియాస్, షానవాజ్, బషీర్, కుటాల గణేష్, రాజ, ప్రసాద్, కిన్నెర మహేష్, చలపతి మరియు సీనియర్ జూనియర్ మెగా అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొని అత్యవసర పరిస్థితుల్లో ఉన్న వారికి సాయ పడాలనే సదుద్దేశంతో రక్తదానం చెయ్యడం జరిగింది. ఈ కార్యక్రమానికి సహాయ సహకారాలు అందించిన బ్లడ్ బ్యాంక్ సిబ్బందికి, మీడియా ప్రతినిధులకు పేరు పేరునా అఖిల భారత చిరంజీవి యువత తరపున మెగా అభిమానుల తరపున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసారు.