మధ్యతరగతి బడ్జెట్

కేంద్ర ప్రభుత్వం 2023-24 ఆర్థిక సంవత్సరానికిగాను ఈ రోజు ప్రవేశపెట్టిన బడ్జెట్ మధ్యతరగతికి ఆర్థికపరంగా ఊరటను కలిగిస్తుందని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ ఒక ప్రకటనలో వ్యాఖ్యానించారు. ముఖ్యంగా ఆదాయ పన్ను విషయంలో ఇచ్చిన రాయితీలు, శ్లాబుల మార్పులు ఉద్యోగ వర్గాలకు సంతోషాన్ని కలిగిస్తాయి. అలాగే మహిళలు, వృద్ధుల పొదుపు పథకాలకు ఇచ్చిన రాయితీలు ఆయా వర్గాల్లో పొదుపు ఆసక్తిని పెంచుతాయి. వ్యవసాయ రుణాల లక్ష్యాన్ని 11 శాతం పెంచడం రైతాంగానికి ఉపయుక్తంగా ఉంటుంది. అలాగే చిరు ధాన్యాలకు ప్రాధాన్యం పెరిగేలా ప్రత్యేక పథకం తీసుకురావడం మంచి పరిణామని నాదెండ్ల మనోహర్ వివరించారు.